EPAPER
Kirrak Couples Episode 1

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Students : కలుషితాహారం ఎఫెక్ట్.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత..

Kasturba Gandhi students news telugu(Telangana news live) : వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 70 మంది విద్యార్థులు అర్ధరాత్రి నుంచి కడుపులో మంటతో ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు.


రాత్రి సమయంలో కస్తూర్బా విద్యాలయంలో ఒక్కరే టీచర్‌ ఉన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో శుక్రవారం ఉదయానికి విద్యార్థుల పరిస్థితి మరింత విషమంగా మారింది.

అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా హాస్పటల్ కు తరలించాలని వైద్యులు స్పష్టం చేశారు. ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు. తమ పిల్లలు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Kaleshwaram: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. అధికారులు అబద్ధమాడితే కేసులు నమోదు, ప్రమోషన్ కట్?

Mahesh Babu: సీఎం రేవంత్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు భేటీ.. వరద బాధితులకు భారీ విరాళం

Prakash Raj vs VHP: తిరుమల లడ్డూపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు.. నీకెందుకు? అని వీహెచ్ పీ హెచ్చరిక

BRS MLAs Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. అడ్డుపడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ఫైర్

Tobacco in Laddu : మరోసారి బయటపడ్డ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. ఈసారి కల్తీ కాదు.. ఏకంగా పొగాకే..

Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు.. అన్నీ అందులోనే.. సీఎల్పీ మీటింగ్ లో సీఎం రేవంత్

Hydra Demolish in Madhapu: మాదాపూర్‌పై హైడ్రా కన్ను.. అక్రమంగా నిర్మాణాలు కూల్చివేత

Big Stories

×