EPAPER

SP Serious on Minors Driving: మైనర్ డ్రైవింగ్‌పై ఎస్పీ వార్నింగ్.. పట్టుబడితే కఠిన చర్యలు

Minor Driving: సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌లపై పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

SP Serious on Minors  Driving: మైనర్ డ్రైవింగ్‌పై ఎస్పీ వార్నింగ్.. పట్టుబడితే కఠిన చర్యలు
Local news telangana

SP Warning to Minors About Driving: సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌లపై పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల తెలిసీ తెలియని డ్రైవింగ్‌ చేస్తున్నారన్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం వల్లేనని.. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను, వాహనాల యజమానులను హెచ్చరించారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని లోటన్నారు.

మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ తీసుకోవాలని సూచించారు. తద్వార విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.


Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×