EPAPER

Viral Video: వింత ఘటన.. చనిపోయాడనుకుని కుంటలోంచి బయటకు తీస్తుండగా లేచి నిలబడ్డాడు!

Viral Video: వింత ఘటన.. చనిపోయాడనుకుని కుంటలోంచి బయటకు తీస్తుండగా లేచి నిలబడ్డాడు!

Hanamkonda news today(Local news telangana): ఉమ్మడి వరంగల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నీటికుంటలో గంటల కొద్ది మృతదేహం వలే తేలియాడుతూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు ఆందోళన చెందుతూ 108 సిబ్బింది మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని అతడు మృతిచెందాడనుకుని బయటకు తీస్తుండగా, ఒక్కసారిగా లేచినిలబడ్డాడు. దీంతో వారంతా అవాక్కయ్యారు. అనంతరం అతడిని పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.


ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం వివరాల్లోకి వెళితే.. హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెల కుంటలో ఓ వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలోనే మృతదేహం వలే తేలియాడుతూ ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతిచెందాడనుకుని అతడిని కుంటలోంచి బయటకు తీస్తుండగా, అతను ఒక్కసారిగా లేచినిలబడ్డాడు. అతను బ్రతికే ఉండడంతో వారంతా అవాక్కయ్యారు. అనంతరం అతడిని విచారించగా, నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో రోజుకు 12 గంటలపాటు ఎండకు పని చేస్తున్నట్లు,.. ఆ వేడికి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చినట్లు అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, అప్పటివరకు టెన్షన్ గా ఎదురూచూసిన వారంతా.. అతడు నీళ్లలోంచి నడిచి రావడంతో షాక్ గురవడమే కాదు.. ఆశ్చర్యానికి లోనయ్యారు.


Also Read: కేంద్ర మంత్రులుగా తెలుగువారు.. శాఖలివే..

పోలీసులు, మరియు 108 సిబ్బంది, అలాగే స్థానికుల సమయం వృథా చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ కూడా షాకవుతున్నారు. అనంతరం వారు పలు రకాలుగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Tags

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

×