Big Stories

Congress: కాంగ్రెస్ వార్ రూమ్ కేసుపై స్టే.. పోటీసులకు హైకోర్టు షాక్

Congress: పోలీసులు కావాలనే దాడి చేశారు. మా పార్టీ వార్ రూమ్ నుంచి కీలక సమాచారం ఎత్తుకెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా దాడి చేస్తారు? ఇది రాజకీయ కుట్ర.. అంటూ తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనపై గట్టిగా పోరాడుతోంది. సునీల్ కనుగోలు నడిపిస్తున్న కార్యాలయంపై పోలీస్ దాడిని పార్టీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆందోళనకు చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

- Advertisement -

అటు, వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలుకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సునీల్ పరారీలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా రాజకీయ వేడి రగులుతుండగానే.. హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ పోలీసులకు చుక్కెదురైంది.

- Advertisement -

వార్ రూమ్ ఘటనలో పోలీసుల విచారణపై స్టే విధించింది హైకోర్టు. 41 సీఆర్పీసీ నోటీసులపైనా స్టే ఇచ్చింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది.

వార్ రూమ్ పేరుతో కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారనేది పోలీసులు ఆరోపణ. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలతో పాటు బీజేపీ నేతలు టార్గెట్ గా మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారని కేసు పెట్టారు. వారం క్రితం మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేసి.. కంప్యూటర్లను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాస్త ఉద్రిక్తత తలెత్తింది. అప్పటి నుంచి సునీల్ కనుగోలు పరారీలో ఉండగా.. అతని కోసం ఢిల్లీకి పోలీస్ ప్రత్యేక టీమ్ వెళ్లింది. తాజాగా, హైకోర్టు స్టే తో కాస్త ఊరట లభించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News