EPAPER

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Telangana: రాష్ట్ర సచివాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని రూపంలో ఈ విగ్రహం ఉండాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం దేశంలోని రాజీవ్ విగ్రహాలను అన్నింటిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోని విగ్రహాలు అన్నింటిని పరిశీలించిన తర్వాత ఒక రూపాన్ని డిసైడ్ చేశారు. ప్రస్తుతం సచివాలయం ఎదుట ఉన్న చెక్కిన రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రత్యేకత ఉన్నది.


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎంతో ఆదర అభిమానాలు చూపించేవారు. ఎదురు వచ్చి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకునేవారు. వేదిక పైనా ఆయనకు పూలమాలలు వేసి సత్కరించేవారు. కానీ, రాజీవ్ గాంధీ ఆ పూలమాలలను మెడలో ఉంచుకునేవారు కాదు. ప్రజలు చూపించిన ఆ అభిమానాన్ని తిరిగి వారిపైనా కురిపించేవారు. ఇందులో భాగంగా ఆయన ఆ పూల మాలలను తిరిగి అభిమానులు, ప్రజలపైనకు విసిరేసేవారు.

Also Read: Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి – వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం


ఈ విషయాన్ని ప్రధానం చేస్తూ రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కూడా పూలమాలను ఎదుటి వారి మెడలో పడే విధంగా విసిరేస్తున్నట్టుగా ఉన్నది. ఇలాంటి విగ్రహం ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేదు. రాష్ట్ర సచివాలయం ముందు ఎక్కడా లేని రూపంలో రాజీవ్ గాంధీ విగ్రహం రూపంలో దర్శనమిస్తున్నారు.

విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానమిస్తారు

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నదని వివరించారు. రాజీవ్ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దానికి తీసుకువచ్చిన మహా నాయకుడని పేర్కొన్నారు. అలాంటి నాయకుడి విగ్రహాన్ని కూలగొడతామని, తరలిస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని తెలిపారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఒకవేళ జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతాయని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే సోనియా గాంధీ అని, అలాంటప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుందని మాట్లాడటంలో అర్థమే లేదని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే ప్రతిష్టించాలని, విగ్రహాన్ని ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నాయకులు విరమించుకోవాలని హితవు పలికారు. దేశంలో సాంకేతిక విప్లవం, మహిళలకు రిజర్వేషన్లు, ఓటు హక్కు 18 ఏళ్ల వారికే ఉండాలనే కీలకమైన నిర్ణయాలు ఆయన ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. దేశాన్ని ప్రగతి పథంలో.. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేసిన మహా నేత.. రాజీవ్ గాంధీ అని వీహెచ్ పునరుద్ఘాటించారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×