EPAPER

Telangana: అభివృద్ధిలో ‘స్పీడ్’.. ప్రత్యేక మిషన్ ఏర్పాటు

Telangana: అభివృద్ధిలో ‘స్పీడ్’.. ప్రత్యేక మిషన్ ఏర్పాటు

– 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్
– ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక చొరవ
– పనులను వేగంగా పూర్తి చేసే సంకల్పం
– ‘స్పీడ్’ పేరుతో ప్రత్యేక మిషన్
Development: కొత్త సిటీ నిర్మాణం, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కీలక అడుగు వేసింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పేరుతో కొత్త కార్యాచరణకు దిగింది. ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను దీని పరిధిలోకి చేర్చింది.


సీఎం ఆధ్వర్యంలో అంతా!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షిస్తారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలనేది స్పీడ్ లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఆలస్యం లేకుండా ప్రత్యేక ప్లాన్

ఏ ప్రాజెక్ట్‌లోనూ ఆలస్యం జరగకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పట్టణాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు.

Also Read: MP Arvind: దమ్మున్నోళ్ళకే కుర్చీ..: ఎంపీ ధర్మపురి అరవింద్

క్రమం తప్పకుండా సమీక్షలు

ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరును సమీక్షించుకొని పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది.

స్పీడ్ ప్రోగ్రాంలోని 19 ప్రాజెక్టులు

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్
శాటిలైట్ టౌన్ల అభివృద్ధి
మెట్రో రైలు విస్తరణ
జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ
రీజినల్ రింగ్ రోడ్
హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు
రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు
ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం
మహిళా శక్తి పథకం అమలు
జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం
రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్‌లు
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి
ఐటీఐలలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు
కొత్త ఉస్మానియా హాస్పిటల్
15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు
హెల్త్ టూరిజం ప్రమోషన్
ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్
టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం
యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×