EPAPER

BRS Party: గు‘లాబీయిస్ట్’ ఆఫీసర్స్.. ఇకనైనా మారండి సార్..!

BRS Party: గు‘లాబీయిస్ట్’ ఆఫీసర్స్.. ఇకనైనా మారండి సార్..!

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం:

బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే కాళేశ్వరం, కరెంట్‌పై కమిషన్స్ విచారణ జరుగుతోంది. ఇంకా భూములు, గొర్రెల స్కాములు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇలా చాలానే బయటకు వచ్చాయి. వాటిపైనా దర్యాప్తు జరుగుతోంది. నిజానికి వీటిని ముందే గ్రహించి, బీఆర్ఎస్ పాలన నచ్చకే ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టారు. కానీ, ప్రజల నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు మాత్రం వారి తీర్పుకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. బీఆర్ఎస్ బినామీలకు అండగా నిలబడుతూ, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.


మెడికల్ మాఫియాపై చర్యలేవి?

రాష్ట్రంలో విచ్చలవిడిగా మెడిసిన్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940, రూల్స్ 1945, సెక్షన్ 65 (ii) తుంగలో తొక్కి కోట్లు దండుకుంటున్నారు. ఈ మెడికల్ మాఫియాతో యువత చిత్తు అవుతోందని కథనాలు రాస్తే 20 రోజులుగా చర్యలు తీసుకున్నది లేదు. కార్పొరేట్ కంపెనీల మామూళ్ల మత్తులో గత పదేళ్లుగా మునిగిన అధికారులు కాంగ్రెస్ పాలనలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న మెడికల్ షాపులపై రెయిడ్స్ చేసి హడావుడి చేస్తున్నారే గానీ, కార్పొరేట్ కంపెనీల బండారాన్ని బయటపెట్టినా అటువైపు చూడడం లేదు. పైగా, వారికే మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. 30 వేలు ఇచ్చి ఫార్మాసిస్టులను పెట్టుకోలేని మెడ్ ప్లస్, అపోలో కంపెనీలు డిస్కౌంట్ల పేరుతో 100 నుంచి 125 శాతం లాభాలు పొందుతున్నాయి. ఇది మామూలుగా అయితే సాధ్యం కాని పని. నిబంధనలు నీళ్లొదిలి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ దందాను స్వేచ్ఛ-బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్‌తో బట్టబయలు అయింది. అధికారులు నోటీసులు ఇచ్చామని చెప్పుకుని చేతులు దులుపుకుంటున్నారే గానీ, మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలు, ఫార్మా గైడ్ లైన్స్ ఎక్కడా పాటించడం లేదు. కనీసం ప్రిస్కిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఎలా అమ్ముతున్నారని అడిగే నాథుడే లేడు. ఈ దందా అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కామన్‌గా ఉండేది. అందుకు కోట్లాది రూపాయలు చేతులు మారేది. ఇప్పుడు రూల్స్ ఫాలో కావాలన్నందుకు బీఆర్ఎస్ బినామీ కంపెనీలను కాపాడేందుకు ఐపీఎస్‌లను, ఐఏఎస్‌లను అడ్డం పెట్టుకుని రాజకీయం మొదలుపెట్టారు. మీడియా స్టింగ్ ఆపరేషన్లతో ఎంతోమంది మంత్రి పదవులే ఊడిపోయాయి. అలాంటిది ఆఫీసర్స్ ఇంటర్య్వూ ఇచ్చి మధ్యలోనే వెళ్లగొట్టినా, చట్టాలు చుట్టాలుగా మార్చుకున్నా ప్రశ్నించ వద్దని, రాజీనామా చేస్తారా అని అడగవద్దని కేటీఆర్ లాంటి వారు మాట్లాడడం విడ్డూరం.

80వేల మంది ఫార్మాసిస్టుల్లో 30వేల మంది నిరుద్యోగులు

గత పదేళ్లలో 80 వేల మంది ఫార్మా విద్యార్ధులు బయటకు వచ్చారు. వారిలో చాలామందిని ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. 10వ తరగతి చదివిన వారికి ట్రైనింగ్ ఇచ్చి 10 వేల నుంచి 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. 18 వేలకు జీతం పెరగగానే ఇబ్బందులు పెట్టి వదిలించుకుంటున్నారు. నిరుద్యోగులపై ఎప్పుడూ ప్రేమ లేని కేటీఆర్ ఇప్పుడు ఐపీఎస్ కమలాసన్ రెడ్డికి మాత్రం వత్తాసు పలకడం హాస్యాస్పదం. అపాయింట్ మెంట్ ఇచ్చి ఇంటర్వ్యూ‌కి రమ్మంటేనే బిగ్ టీవీ ప్రతినిధి వెళ్లారు. మధ్యలో ఫార్మా గురించి ప్రశ్నలు అడిగితే ఇబ్బందిపడి ఒక మహిళా జర్నలిస్టు అని కూడా చూడకుండా బయటకు నెట్టివేశారు. ఆ తర్వాతనే ఆమె మీరు రాజీనామా చేస్తారా అంటూ మరోసారి వెళ్ళి ప్రశ్నించారు. కేవలం, చివరి 35 సెకన్స్ వీడియోను వైరల్ చేస్తూ, బీఆర్ఎస్ వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలపై చర్యలేవి అని అడగడం తప్పయిందా?

సోమేష్ నుంచి కమలాసన్ రెడ్డి వరకు..?

మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అవినీతికి పాల్పడి, జీఎస్టీ, ధరణి కేసుల్లో పీకల్లోతులో కూరుకుపోయారు. కమలాసన్ రెడ్డి పైన గతంలో ఇంటెలిజెన్స్ నివేదిక ఉందని పోలీస్ శాఖలో టాక్ ఉంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మానేరు నుంచి హైదరాబాద్ ఇసుక తరలింపులో సహకరించినందుకు ఒక్కొక్క లారీకి నెలకు రూ.50 వేల చొప్పున 1400 లారీల నుంచి డబ్బలు కరీంనగర్ కమిషనరేట్‌కి చేరేవని గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే, పీడీఎస్ బియ్యం రాష్ట్రం దాటేలా అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి పీఏతో చేతులు కలిపితే, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని ఇంటెలిజెన్స్‌కు నివేదిక అందింది. కరోనా సమయంలో వైన్స్‌, బార్స్‌కి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడంపై కరీంనగర్‌లో ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, పదేళ్లలో ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా సహకరించాలో అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంతోనే కేసీఆర్ పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే, కేటీఆర్ ట్విట్టర్ స్పందన వెనుక కార్పొరేట్ కంపెనీల లాలూచీ ఉందని తెలుస్తోంది. బినామీలను కాపాడుకుంటే, వందల కోట్లు మళ్లీ పార్టీ ఫండ్స్ వస్తాయని ఆశ చూపించి తప్పుదారి పట్టిస్తున్నారని ఫార్మాసిస్ట్ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అందుకే, కేటీఆర్ ఇంటి ముందు ధర్నాకు వారు ప్లాన్ చేసుకుంటున్నారు.

బ్లాక్ షీప్స్ ఎంతమంది?

పదేళ్ల ముందు ఏదైనా వార్త వస్తే దానిపై దర్యాప్తు చేసి రిపోర్టు ఇచ్చేవారు. కానీ, 2014 తర్వాత కళ్లముందు ఎన్నో మోసాలు, ఆర్ధిక స్కాములు జరుగుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. ఆఫీసర్స్‌ని ప్రజాస్వామ్యబద్దంగా కాకుండా ప్రైవేట్ సైన్యంలా నడిపించుకున్నారు. దాంతో అల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరిగాయి. అదే రుచి మరిగిన అధికారులు, కొద్ది రోజుల్లో రిటైర్డ్ అవుతామని కొంత మంది, ఎక్స్టెండ్‌లో ఉన్న మరి కొంత మంది అధికారులు బీఆర్ఎస్‌కి అనుయాయులుగా పనిచేశారు. ఇప్పటికీ పని చేస్తున్నారు. ఆ కోవలోనే కమలాసన్ రెడ్డి వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇటీవల సుంకిశాల ప్రమాదం దాచిపెట్టిన జలమండలి ఈడీ సత్యనారాయణపై బదిలీ వేటు వేశారు. 6 ఏండ్ల క్రితమే రిటైర్డ్ అయిన ఆయన సర్వీస్ వాడుకుందాం అనుకున్నారు. ఈ నెల 6న మళ్లీ ఒక సంవత్సరం పెంచారు. తప్పుదారి పట్టించిన డైరెక్టర్ సుదర్శన్‌తో పాటు ఇంజినీర్‌పై వేటు పడింది. అంటే, ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డు ప్రమాదాలకు మించిన ప్రమాదం మెడికేషన్ ఎర్రర్స్‌తో వస్తున్నాయి. అలాంటి ఫార్మా, మెడికల్ మాఫియాని బీఆర్ఎస్ నేతలు వెనకేసుకొస్తున్నారు. అప్పట్లో అరబిందో ఫార్మా పార్థసారథి రెడ్డిని పార్లమెంట్‌కి పంపింది కూడా ఈ బినామీ బ్లాక్ షీప్ వ్యవస్థనే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు మేలు జరగాలని, మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని అడుగడం గులాబీ నేతలకు తప్పుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు సైడ్ ట్రాక్ వదిలేసి, మెయిన్ ట్రాక్‌లో పడితే బెటర్. లేదంటే, ఇప్పటికే కేసుల్లో ఇరుక్కున్న అధికారుల మాదిరి కష్టాలు పడాల్సి వస్తుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.

కేటీఆర్ కుట్రను ఖండిస్తున్నాం!

గవర్నమెంట్ మీద బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటీఆర్ కుట్రలను తెలంగాణ రాష్ట్ర ఫార్మసిస్టులంతా ఖండిస్తున్నాం. ప్రజారోగ్యాన్ని, నిరుద్యోగ యువత ఫార్మాసిస్టుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్వేచ్ఛ-బిగ్ టీవీ చేసిన ఆపరేషన్‌లో భాగంగా జరిపిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 45వేల మెడికల్ షాపుల్లో దాదాపు 40 వేల మెడికల్ షాపుల్లో క్వాలిఫైడ్ ఫార్మాసిస్టులు లేకుండా టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతో నడుపుతున్నారు. ఇందులో అపోలో, మెడ్‌ప్లస్ లాంటి కార్పొరేట్ చైన్ ఫార్మసీలు ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ ఇస్తున్నాయి. యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940, రూల్స్ 1945, సెక్షన్ 65(ii) ను అమలు పరచవలసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు, చట్టాన్ని తుంగలో తొక్కి చోద్యం చూస్తున్నారు. గవర్నమెంట్ మీద బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటీఆర్ కుట్రలను మేం గమనిస్తూనే ఉన్నాం. గతంలో రాష్ట్రంలో గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేవి, దీంతో యువత విచ్చలవిడిగా బానిసలుగా మారారు. గతంలో జరిగిన యువతకు, యువత తల్లి తండ్రులకు జరిగిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఉక్కు పాదం మోపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి దొరకడం కష్టంగా మారింది. కాదు కాదు అసలు దొరకడం లేదు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు దొరకనప్పుడు వాటికి బానిసలుగా మారిన యువత ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం స్వేచ్ఛ- బిగ్ టీవీ చేసింది. యువతను మత్తు టాబ్లెట్స్‌కు బానిసలుగా మెడికల్ షాపులు, యజమానులు చేస్తున్నట్టు తేలింది. కొన్ని పెద్ద షాపులు చేస్తున్న దారుణాలు వింటే తెలంగాణలో మెడికల్ మాఫియా అరాచకాలు బయటపడ్డాయి. గంజాయి, డ్రగ్స్ దొరకని సమయంలో మత్తు టాబ్లెట్స్ వాడుతున్నట్లు యువత చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్ ఎలా ఇస్తున్నారు అని స్టింగ్ ఆపరేషన్‌ చేస్తే నిజాలు బయటకొచ్చాయి. మరి మత్తు టాబ్లెట్స్ అక్రమంగా అమ్ముతున్న మెడ్ ప్లస్, అపోలో లాంటి వారిపై ఎందుకు దాడులు చేయడం లేదు. దీనికి అధికారులు సమాజానికి సమాధానం చెప్పాలి కదా. 40 వేల మెడికల్ షాపుల్లో క్వాలిఫైడ్ ఫార్మాసిస్టులు లేకుండా టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతో ఎందుకు నడుపుతున్నారో సమాజానికి అధికారులు సమాధానం చెప్పాలి కదా. పైగా ప్రభుత్వం చేస్తున్న మంచిని సమాజానికి చెప్తున్న స్వేచ్ఛ- బిగ్ టీవీని టార్గెట్ చేయడం చాలా బాధాకరం. గవర్నమెంట్ మీద బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటీఆర్ కుట్రలను తెలంగాణ రాష్ట్ర ఫార్మాసిస్టులందరం ఖండిస్తున్నాం.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×