Software engineer raped in Hyderabad(Latest news in Hyd): రకరకాల ఆశలతో హైదరాబాద్ సిటీకి చాలామంది వస్తుంటారు. అందులో సక్సెస్ అయినవారు కొంతమంది మాత్రమే. మరికొందరికి నిరాశే ఎదురవుతుంది.. ఎదురైంది కూడా. అలాంటివారిలో మహిళా టెక్కీ ఒకరు. సినిమాల్లో నటించాలన్నది ఆమె కోరిక. ఆమె వీక్‌నెస్‌ని తనకు అనుకూలంగా మలచుకున్నాడు కామాంధ డైరెక్టర్. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ సిటీలో ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే ఆమెకు సినిమాల్లో నటించాల న్నది కోరిక. తెలిసిన యువతి టెక్కీని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌వర్మకు పరిచయం చేసింది. ప్రస్తుతం తాను ఒక ప్రాజెక్టు చేస్తున్నానని, అందులో ఛాన్స్ లేదని మరొక ప్రాజెక్టుకు తీసుకుంటానని చెప్పి టెక్కీని నమ్మించాడు. నిజమేనని ఆమె నమ్మేసింది.
టెక్కీ వీక్‌నెస్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు సిద్ధార్ధ్ వర్మ. ఆ యువతితో క్రమంగా పరిచయం మరింత పెంచుకున్నాడు. సినిమాల్లో ఛాన్స్ ఉందని చెప్పి ఆమెని నమ్మించాడు. చివరకు డిన్నర్‌కు తన ఇంటికి పిలిచాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
ALSO READ: కేసీఆర్ రాజకీయాలు ఇంతలా ఉంటాయా?
చివరకు తాను సిద్ధార్థ్ చేతిలో మోసపోయానని తెలుసుకున్న బాధిత టెక్కీ నేరుగా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ్‌వర్మను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడ్ని విచారిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకెంతమంది వెలుగులోకి వస్తారో చూడాలి.