EPAPER
Kirrak Couples Episode 1

Uppal Police Station Reel: సెంట్ బాటిల్ పై పోలీస్ స్టేషన్ లో రీల్.. పోలీసుల రియాక్షన్ ఇది.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ?

Uppal Police Station Reel: సెంట్ బాటిల్ పై పోలీస్ స్టేషన్ లో రీల్.. పోలీసుల రియాక్షన్ ఇది.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ?

Reel in Uppal Police Station: టిక్ టాక్ వచ్చాక దేశంలో రీల్స్ పిచ్చి మొదలైంది. కరోనా రాకతో.. చైనాకు చెందిన టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేశారు. దీంతో చాలా మంది హమ్మయ్యా అనుకుంటే.. ఇన్ స్టా గ్రామ్ తో పాటు ఫేస్ బుక్, యూ ట్యూబ్ లోనూ రీల్స్ మొదలయ్యాయి. ప్రతిఒక్కరూ ఒక పేజ్ లేదా ఛానెల్ స్టార్ట్ చేయడం.. ఫేమస్ అవ్వాలని ఇష్టమొచ్చినట్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది. వాళ్లకి వాళ్లు పెట్టుకున్న పేరు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఏదైనా మంచి చేసి ఫేమస్ అయితే ఇన్ఫ్లుయెన్సర్లు అనొచ్చు. కానీ.. లైకులు, షేర్ల కోసం అడ్డమైన రీల్స్ చేసి పోస్ట్ చేయడం. వాటివల్ల చూసే వాళ్లకి లేనిపోని ఆలోచనలు రావడం, ఏదో కొత్తగా ట్రై చేయాలని అనుకుని.. బోల్తా పడటం.. ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి.


నిజానికి సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఎంతుందో గాని.. ప్రమాదాలు చాలానే ఉన్నాయి. సెల్ఫీ మొబైల్స్ వచ్చాక.. బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎత్తైన ప్రాంతాలు, రైళ్లలో వెళ్తూ సెల్ఫీలు తీసుకుంటూ చనిపోయారు చాలామంది. ఇప్పుడు రీల్స్ వల్ల కూడా అదే జరుగుతుంది. రొటీన్ కు భిన్నంగా రీల్స్ చేయాలని ప్రయత్నించి.. ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో లేనిపోని కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవలే ఓ యువకుడు రోడ్లపై డబ్బు చల్లి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సంచలనమే అయింది. చూసినవారంతా మరీ అంత బలుపేంటి అని విమర్శించినవారే గానీ.. ఎవ్వరూ మెచ్చుకోలేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రీల్ చేసిన కుర్రాళ్ల పరిస్థితి ఇదే. పర్మిషన్ లేకుండా పీఎస్ ఆవరణలో రీల్ చేసి.. కేసు మీదికి తెచ్చుకున్నారు ముగ్గురు యువకులు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..


ముగ్గురు యువకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సెంట్ బాటిల్ పై రీల్ చేశారు. ఆ వీడియోలో ఒకడు సెంటి బాటిల్ తీసుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుండగా.. ఇంకొకడు ఎందుకు వెళ్తున్నావ్ రా అని అడుగుతాడు. ఈ సెంట్ కొట్టుకుంటే చుట్టూ పోరీలంతా గుంపుచుడతారని టీవీల్లో చూపిస్తారని కొన్నానని, తాను కొట్టుకుంటే ఒక్క పోరీ కూడా రావట్లేదని, అందుకే సెంట్ బాటిలోళ్ల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్తాడు. ఈ రీల్ లో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. మరొక వ్యక్తి మొబైల్ తో రీల్ చేశాడు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ రీల్ వైరల్ అవుతోంది. రీల్స్ పిచ్చితో ఆఖరికి పోలీస్ స్టేషన్ ను కూడా వదల్లేదని తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేయడంతో.. ఉప్పల్ పీఎస్ పోలీసులు రీల్ చేసిన వ్యక్తులపై యాక్షన్ తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా పీఎస్ ఆవరణలో రీల్ చేయడం, పోలీసులపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఏ1గా బల్విర్ సింగ్, మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి రీల్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారో మరి.

 

Related News

BJP Targets Rahul: మోదీజీ మీ స్థాయి ఇది కాదు: భట్టి విక్రమార్క

PAC Meeting: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

Hyderabad apartments rates: హైదరాబాద్‌లో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్లు, ఆశపడ్డారో ఇక అంతే..

Sitaram Yechury: ఆయన పోరాట స్ఫూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతాం : సీఎం రేవంత్

Kokapet: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

Muscle Atrophy : నలభై ఏళ్లుగా మంచానికే పరిమితం.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటున్న బాధితుడు

Big Stories

×