EPAPER
Kirrak Couples Episode 1

SIT Report: హరీష్ రావు అమిత్ షాను సంప్రదించారా? పార్టీని చీల్చాలని చూశారా?.. సిట్ రిపోర్టులో సంచలనం!

SIT Report: హరీష్ రావు అమిత్ షాను సంప్రదించారా? పార్టీని చీల్చాలని చూశారా?.. సిట్ రిపోర్టులో సంచలనం!

SIT Report: ఫాంహౌజ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముగ్గురు నిందితుల విచారణలో ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. పెద్ద రాజకీయ కొండనే తవ్వుతున్నారు సిట్ అధికారులు. తవ్వుతున్నకొద్దీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు కీలక సంచలనాలు బయటపడుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కోదండరాం, దామోదర రాజనర్సింహాలకూ గాలం వేయడం.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలనూ బీజేపీలోకి లాగాలని ప్రయత్నించడం ఇలా అనేక రాజకీయ విస్పోటనాలు.


లేటెస్ట్ గా సిట్ హైకోర్టుకు సడ్మిట్ చేసిన రిపోర్టులో మరిన్ని పాత విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేసే ప్రయత్నం జరగడం.. అలా జరిగితే బీజేపీకి అత్యంత ప్రమాదకర పరిణామమని పార్టీ పెద్దలతో రామచంద్రభారతి గతంలో మాట్లాడినట్టు వాట్సాప్ చాట్ ద్వారా గుర్తించింది సిట్. ఇక, “కేసీఆర్‌ బృందంలోని వ్యక్తి అమిత్‌జీని సంప్రదించారు. అతడు బీజేపీలోకి వస్తే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మీరు సాధ్యమైనంత తొందరగా సమయం కేటాయించండి” అంటూ రామచంద్ర భారతి మెసేజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా గతంలో ఎప్పుడో జరిగినట్టు అంచనా వేస్తోంది. అంటే, ఏళ్లుగా వీళ్లు ఇదే పని మీద ఉన్నారా? అనే అనుమానం.

ఇక, అమిత్ షాను సంప్రదించిన కేసీఆర్ బృందంలోని ఆ కీలక వ్యక్తి ఎవరనేదే ఆసక్తికరం? అతను వస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అన్నారంటే.. బాగా పెద్ద స్థాయి లీడరే అయ్యుంటారు. వస్తూ వస్తూ తన వెంట చాలామంది ఎమ్మెల్యేలను తీసుకొస్తేనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత పెద్ద లీడర్ ఎవరా అని ఆరా తీస్తే.. హరీష్ రావు కావొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


గతంలో కేసీఆర్ పై హరీష్ రావు కుట్రలు చేశారంటూ ప్రచారం జరిగింది. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించాలంటూ హరీష్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బొటాబొటి సీట్లు వస్తే.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని బీజేపీలో చేరేందుకు హరీష్ ప్రయత్నం చేశారని అంటారు. అమిత్ షాతో ఆ మేరకు డీల్ కుదిరిందని అన్నారు. అందుకే గులాబీ బాస్ అల్లుడిని కొన్నాళ్ల పాటు పక్కన కూడా పెట్టేశారు. తాజాగా, సిట్ నివేదికలోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. హరీష్ రావు పేరు లేకపోయినా.. ఆయన ఈయనే అంటున్నారు. ఈటల రాజేందర్ సైతం హరీష్ రావు మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. ఉభయ అవసరాల నిమిత్తం ఇప్పుడు మామా-అల్లుల్లు కలిసిపోయారు కానీ.. గతంలో కేసీఆర్ కు హరీష్ గోతులు తవ్వారనే అపవాదు అయితే ఉంది. సిట్ రిపోర్డుతో అప్పటి హరీశ్ రావు ఎపిసోడ్ మరోసారి చర్చకు వస్తోంది.

Related News

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Big Stories

×