EPAPER
Kirrak Couples Episode 1

Singareni : సింగరేణి జంగ్.. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..

Singareni : సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 90 శాతం మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 13 యూనియన్లు పోటీ పడ్డా.. AITUC, INTUC మధ్యే హోరాహోరిగా పోరు నడిచినట్టు తెలుస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమని రెండు యూనియన్లు చెబుతున్నాయి. మరోవైపు బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రస్తుతం హడావుడికి దూరంగా ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మధ్యాన్నం 3 గంటల వరకు 37వేల 26 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం 93.09 శాతంగా నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే కొత్తగూడెం కార్పొరేట్లో 11వందల 91 ఓట్లకు గాను.. 11వందల 24 ఓట్లు పోలయ్యయి. 94.37 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 2వే 331 ఓట్లకు గానూ.. 2వేల 176 ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ శాతం 93.35 శాతం అని తెలుస్తోంది.

ఇల్లందులో 613 ఓట్లకు గాను 602 ఓట్లు పోలవగా.. నమోదైన పోలింగ్ శాతాన్ని 98.20 అని చెబుతున్నారు. మణుగూరులో 2వేల 414 ఓట్లకు గాను 2వేల 365 ఓట్లు నమోదు కాగా.. 97.97 పోలింగ్ శాతం నమోదు అయ్యింది. భూపాలపల్లి ఏరియా సింగరేణిలో పోలింగ్ ముగిసింది. బూత్ నంబర్ మూడు మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా సాగింది. 5వేల 310 మంది ఓటర్లకు గాను… 5వేల 123 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ 94.7 శాతం పోలింగ్ నమోదైంది.

కాంగ్రెస్ అనుబంధ INTUC, సీపీఐ అనుబంధ AITUC సంఘాల మధ్య హోరా హోరీ పోరు నెలకొంది. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్ కి తరలించారు. సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ లో కౌంటింగ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ కోసం 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం ఏడు గంటలకు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభిస్తారు.

Tags

Related News

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Big Stories

×