EPAPER

Singareni elections : ఆఖరి ఘట్టానికి సింగరేణి జంగ్.. ఎల్లుండే తుది సమరం..

Singareni election : సింగరేణి జంగ్‌ ఆఖరి గట్టానికి చేరుకుంది. ఇప్పటికే ప్రచార సమయం ముగియడంతో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే కోల్ బెల్ట్ ఏరియాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అనుబంధ విభాగం సత్తా చాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది TBGKS.

Singareni elections : ఆఖరి ఘట్టానికి సింగరేణి జంగ్.. ఎల్లుండే తుది సమరం..
TS News updates

Singareni elections news(TS news updates):

సింగరేణి జంగ్‌ ఆఖరి గట్టానికి చేరుకుంది. ఇప్పటికే ప్రచార సమయం ముగియడంతో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే కోల్ బెల్ట్ ఏరియాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అనుబంధ విభాగం సత్తా చాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది TBGKS.


సింగరేణి ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకోవడంతో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ నెల 27న జరిగే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుబంధ సంస్థలకు మద్దతు ఇస్తూ పొలిటికల్‌ లీడర్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. యూనియన్‌ నేతలు హామీల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరి నువ్వా నేనా అన్న రేంజ్‌లో దూకుడుగా వ్యవహరిస్తూ విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు అనుబంధ సంఘాల నేతలు.

సింగరేణిలో ఏడోసారి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవలే ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలు మరోసారి సవాల్‌గా తీసుకుంటున్నాయి. గత రెండుసార్లు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచి తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది.


అలాగే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC కూడా ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే అతిపెద్ద యూనియన్‌గా ఉన్న AITUC యూనియన్‌ విజయదుందుబి మోగించే ఎత్తుగడలు వేస్తోంది. ఇక ఈ మూడు యూనియన్లకు మద్దతుగా పొలిటికల్‌ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

నల్ల బంగారంతో ప్రపంచానికి వెలుగులను విరజిల్లుతున్న సింగరేణి సంస్థకు ఏడవసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 11 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎల్లుండి‌ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకి పోలింగ్ జరగనుండగా.. ఏడు గంటల తరువాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×