EPAPER

Shocking Result to BRS: బిత్తరపోయే షాక్ లో బీఆర్ఎస్

Shocking Result to BRS: బిత్తరపోయే షాక్ లో బీఆర్ఎస్

Shocking Result to BRS(Today news in telangana): తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటిదాకా గమనించిన సరళి చూస్తుంటే దాదాపు అన్ని స్థానాలలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంలోనూ లీడ్ దశలో పోటీ కనబరచడం లేదు. ఇక ఎంఐఎం మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ముందంజలో ఉంది. 17 పార్లమెంట్ స్థానాలలో సెగ్మెంట్ల పరిస్థితి చూస్తే మొత్తం 6-7 స్థానాలలో బీజేపీ ముందంజలో ఉండగా కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఆధిక్యత కనబరుస్తోంది. దాదాపు 9 స్థానాలలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఖమ్మం, భువనగిరి, వరంగల్ తో పాటు మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.


కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, మెదక్, మహబూబ్ నగర్ తో పాటు పలు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చివరి ఫలితం వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండేలా కనిపిస్తోంది.2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు పార్లమెంట్ స్థానాలను గెలవగా… బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒక్క స్థానాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సారి జరిగే ఎన్నికలలో అంతా ఊహించినట్లు త్రిముఖ పోటీ గా సాగలేదు. అన్ని చోట్లా ద్విముఖ పోటీయే కనిపించింది. దాదాపు 16 నియోజకవర్గాలలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోటీ నడుస్తోంది. కనీస స్థాయిలో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఎక్కడా కనీసం మెజారిటీ దిశగా కూడా పోటీ లో లేదు.

కనీస స్థాయిలో పోటీ ఇవ్వని బీఆర్ఎస్


మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు తామేదో అద్భుత విజయం సాధించామని ఇదే విజయ పరంపర ఇకపై కొనసాగుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అక్కడ అనుకూలించే అంశాలు వేరేరకంగా ఉంటాయి. అయితే రీసెంట్ ఎగ్జిట్ పోల్స్ అంశాలు , ప్రస్తుత ఓటింగ్ సరళి పరిశీలిస్తే బీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని అర్థం అవుతోంది. దాదాపు 12 సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ పతనం దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంట్ ఫలితాల సరళి కూడా అలానే ఉంది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు పతనం తప్పదని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. మరికొందరైతే ఫలితాల తర్వాత మళ్లీ కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితం అవుతారని జోస్యం చెబుతున్నారు.

పతనం అంచున బీఆర్ఎస్

పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పతనం అంచున పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకున్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఫలితాలు వచ్చే నాటికి కేవలం సింగిల్ డిజిట్ లేక సున్నా స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పరిస్థితి దాదాపు ఇంతే అన్నట్లుగా అంచనా వేశాయి. ఎమ్మెల్సీ విజయం చూపించి కార్యకర్తలలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. నేటి ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఇతర పార్టీలకు వలస వెళ్లిన నేతలతో సహా కొత్తగా మరింతమంది పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి

సింగిల్ డిజిట్ తప్పదా?

బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని రకాల గాంభీర్యపు ప్రకటనలైనా చేయవచ్చు గానీ, ఈ ఎన్నికల ఫలితాల సరళి మాత్రం కేసిఆర్ దళం పతనాన్ని స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. 12 సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో.. ముగ్గురు భారత రాష్ట్ర సమితికి కేవలం సున్న స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేశారు! అదే సమయంలో మరో నాలుగు సంస్థలు సున్న నుంచి ఒక్క స్థానం దక్కే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చాయి. ఒక సంస్థ నుంచి మూడు స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తుండగా, మరో ఇద్దరు రెండు స్థానాలు గెలుస్తారని, ఒకే ఒక్క సంస్థ న్యూస్ 18 మాత్రం రెండు నుంచి ఐదు స్థానాలలో భారత రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని అంచనావేయడం జరిగింది. అయితే వీటన్నింటికీ భిన్నంగా అస్సలు ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేక మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

పార్టీని వీడేందుకు మరికొందరు సిద్ధం

పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండబోతున్నదని ముందే అర్థమైంది ఆ పార్టీ ఎంపీలు పలువురు భారతీయ జనతా పార్టీ కాంగ్రెసులలో చేరిపోయారు. అలాగే టికెట్లు కేటాయించే సీజన్ వచ్చిన తర్వాత ఎంపీ టికెట్లు ఇస్తామంటే పలువురు సీనియర్ నాయకులు మాకు వద్దంటే వద్దంటూ తిరస్కరించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. కొందరైతే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా మాకు వద్దని తిరస్కరించారు. ఒకవైపు కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని అన్నప్పటికీ పుచ్చుకోకుండా వద్దని అన్నవారు.. మరొక పార్టీలోకి గెంతి అక్కడ టికెట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

అంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలలో ప్రభావశీలంగా ఉండగలదనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో పూర్తిగా సన్నగిల్లి పోయింది. వారందరి అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఉత్తుతివే అని, మేము గెలిచి తీరుతాము అని, తండ్రి కొడుకులు చెప్పుకోవచ్చు గాక.. ఇంకో రెండు రోజుల్లో ఆ మాట చెప్పగల అవకాశాన్ని కూడా వారు కోల్పోతారు! ఇప్పటికైనా మేలుకుంటే కనీసం రాబోయే ఐదేళ్లలో పార్టీని కాపాడుకోవడానికి వారు శ్రద్ధ పెట్టడం కుదురుతుంది. ఇంకా అహంకారం వీడకుండా, వాస్తవాలను గుర్తించకుండా ఆత్మవంచనతో నడుచుకుంటే నష్టపోయేది కల్వకుంట్ల కుటుంబమే.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×