EPAPER
Kirrak Couples Episode 1

Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల!.. రేవంత్‌రెడ్డి షాకింగ్ స్టేట్‌మెంట్..

Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల!.. రేవంత్‌రెడ్డి షాకింగ్ స్టేట్‌మెంట్..

YS Sharmila latest news(Breaking news updates in telangana) : అన్నతో గొడవైంది. తట్టాబుట్టా సర్దేసుకుని, అమ్మను తోడుగా తీసుకుని.. ఏపీ నుంచి వచ్చేసింది. తాను తెలంగాణ కోడలినంటూ.. రాజకీయం మొదలెట్టింది. అసలే, రాజన్న బిడ్డ. వేరే పార్టీలో చేరుతుందా? అందుకే, తండ్రి పేరుమీదుగా సొంతంగా వైఎస్సార్‌టీపీ తెరిచేశారు షర్మిల. ప్రైవేట్ ఈవెంట్‌లా పార్టీని నడిపిస్తున్నారనే విమర్శ. ఓ సెక్షన్ మీడియా రెగ్యులర్‌గా తన కవరేజ్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఇక ట్వీట్లు, ప్రెస్‌మీట్లు, పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు, అరెస్టులు, జైలుకు వెళ్లడాలు, ఢిల్లీలో ఫిర్యాదులు.. ఫక్తు రాజకీయ పార్టీలా ఏ1 పాలిటిక్స్ చేస్తున్నారు. అంతా బాగుంది కానీ.. పార్టీలో ఆమె మినహా ఎవరూ కనిపించక పోవడం, వినిపించక పోవడం బిగ్ మైనస్. షర్మిలను ఎవరూ నమ్మట్లేదా? ఆమే ఎవరినీ నమ్మట్లేదా? వైఎస్సార్‌టీపీలో చేరికలు ఎందుకు లేవు?


ఇలాంటి సమయంలో షర్మిల వ్యూహం-2 స్టార్ట్ చేశారు. కర్నాటక వెళ్లి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను స్వల్ప గ్యాప్‌లోనే రెండుసార్లు కలిసొచ్చారు. ఇంకేం. కమాన్ గుసగుస. షర్మిల తన పార్టీని.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారని.. హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని.. డీకేతో డీల్ నడిపిస్తున్నారంటూ ప్రచారం మొదలైపోయింది. పార్టీ పెట్టింది విలీనం చేయడానికా? అంటూ షర్మిల ఆ న్యూస్‌ను ఖండించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తాను తెలంగాణ కోడలినంటూ షర్మిల ఎంతగా మొత్తుకుంటున్నా.. ఆమెను తెలంగాణ మనిషిగా ఇప్పటికీ ఎవరూ నమ్మట్లేదనే చెప్పాలి. జగన్ చెల్లిగా, వైఎస్సార్ బిడ్డగా, సీమ రక్తంగానే చూస్తున్నారు. అందుకే, క్రెడిబిలిటీ క్రైసిస్‌తో కొట్టుమిట్టాడుతున్నారు షర్మిల. లేటెస్ట్‌గా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఆమె తెలంగాణ వాసి కాదంటూ తేల్చేశారు.


షర్మిల ఏపీ మనిషని.. ఆమె వచ్చి తెలంగాణకు నాయకత్వం వహిస్తానంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకున్నదే మనల్ని మనం పాలించుకోవడానికంటూ.. తానున్నంత వరకు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని తేల్చి చెప్పేశారు. అయితే, షర్మిల.. ఏపీకి పీసీసీ చీఫ్ అయితే స్వాగతిస్తానని.. వెళ్లి కలుస్తానని.. ఆమెకు సహకరిస్తానని చెబుతూ.. వైఎస్ షర్మిలను ఏపీకి ఫిక్స్ చేసేశారు. పరోక్షంగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఉండబోదని చెప్పేశారు.

Related News

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Big Stories

×