EPAPER

Telangana Election 2023 : తెలంగాణ ఎన్నికలు.. ABP సీఓటర్ సర్వేలో సంచలన విషయాలు..!

Telangana Election 2023 : తెలంగాణ ఎన్నికలు.. ABP సీఓటర్  సర్వేలో సంచలన విషయాలు..!
Telangana Election

Telangana Election 2023 : తెలంగాణలో త్వరలో ఎన్నికలకు తెరలేచింది…ఈ క్రమంలో ఏ పార్టీ కా పార్టీ తమదే జయమని భావిస్తున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈసారి మార్పుని కోరుకుంటున్నారా? లేక ఎప్పటిలా ఒకే పాలన కరెక్ట్ అంటున్నారా? అన్న విషయంపై ఎవరికి వాళ్లు తమ నిర్ణయాన్ని రుదాలి అని చూస్తారే తప్ప ప్రజల గుండెచప్పుడు ఏమిటి తెలుసుకోవడానికి పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. అయితే సి ఓటర్ సర్వేలో ఊహించని కొన్ని విషయాలు బయటపడ్డాయి.


ఏకపక్ష పరిపాలన ఖచ్చితం అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అని సరికొత్త గళం సీఓటర్ ఓపీనియన్ ద్వారా వెళ్లడం అవుతుంది. కేంద్రం తెలంగాణతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాలకి ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగింది. ఈ మేరకు పోలింగ్ దగ్గర నుంచి ఫలితాలు లెక్కింపు వరకు…ఎన్నికల ప్రచారం నుంచి రిజల్ట్స్ వరకు.. సర్వత్ర ఈ ఐదు రాష్ట్రాలలో హై టెన్షన్ మొదలవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మన పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎంతమంది పౌరులు సిద్ధంగా ఉన్నారు…వాళ్లు ఏ పార్టీని ఎంచుకోబోతున్నారు అనే విషయం పై ఏబీపీ, సీవోటర్ సంస్థలు తమ సర్వేల ద్వారా ఒపీనియన్స్ తెలుసుకున్నాయి..

అయితే ఈ ఒపీనియన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది… తెలంగాణ నాదే…ఆ తరువాత నా కుటుంబానిదే.. అనే రాజకీయ కుల గురువు కే చంద్రశేఖర రావు పార్టీ పరిస్థితి ఈసారి ఎన్నికల్లో తారుమారు అవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈసారి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు కాంగ్రెస్ గెట్టి పోటీని ఇవ్వడానికి బరిలోకి దిగుతుంది. ఈసారి బీఆర్ఎస్ కు 43 నుంచి 55 సీట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంటే కాంగ్రెస్ కి మాత్రం 48 నుంచి 60 సీట్ల వరకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మారుతున్న ఈ లెక్కలు ఎన్నికల వరకు ఇలాగే ఉంటాయా లేక వీటిల్లో హెచ్చుతగ్గులు వస్తాయా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.


మరోపక్క కేంద్రంలో అంతా తానై ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 11 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని సి ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనాలో తేలింది. బిజెపి నాయకత్వ బాధ్యతలు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ భుజాలపై మోస్తూ.. ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ సౌత్ లో బీజేపీ హవా కాస్త వీకే కదా. ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ రిపోర్టు ప్రకారం కనుమరుగైపోతుంది అని అందరూ భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ 10.5 శాతం ఓట్లు ముందంజలో ఉండగా.. అధికార బీఆర్ఎస్ 9.4 శాతం ఓట్లతో నెక్స్ట్ పొజిషన్లో ఉంది. 

ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ ఈసారి కూడా అధికారంలోకి రావాలి అని తెగ ప్రయత్నిస్తోంది. మరోపక్క సీఎం కేసీఆర్ ను ఎలాగైనా ఈసారి గద్దె దించకపోతే తమ మనుగడకే కష్టమని కాంగ్రెస్ రాజకీయ చదరంగం మొదలుపెట్టింది. మధ్యలో ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కాక .. ఎలాగైనా సౌత్ లో కూడా సాలిడ్ గా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో…బీజేపీ తమ పందాలో తాము ముందుకు పోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొదలైన ఈ త్రిముఖ పోరులో.. ఎవరికి ఆధిపత్యం దక్కుతుందో ఫలితాలే తెలుస్తాయి. కానీ 2018లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో…మొత్తం 119 స్థానాలలో 88 సీట్లు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది బీఆర్ఎస్. ఒకపక్క కేసీఆర్ రాజకీయ చతురత పై నమ్మకం…మరోపక్క కేటీఆర్ ఐటి భరోసా…ఈ పార్టీ ఎన్నికలకు ప్రధాన పెట్టుబడులు. మరి 2018 ఎన్నికల్లో కేవలం 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్.. 117 స్థానాలలో పోటీ చేసి ఒకే ఒక సీటు గెలుచుకున్న బీజేపీ…ఈసారి ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడతాయో లేదో చూడాలి మరి.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×