EPAPER
Kirrak Couples Episode 1

TPCC: రేవంతే టార్గెట్?.. అంతా ఆయనే చేశారా?

TPCC: రేవంతే టార్గెట్?.. అంతా ఆయనే చేశారా?

TPCC: టీపీసీసీకి కొత్త కమిటీలు వేశారు. చాలామందికి పదవులు వచ్చాయి. కానీ, అధిష్టానం వేసిన కమిటీలు సీనియర్లకు నచ్చలేదు. తమకు, తమ వారికి సరైన ప్రాధాన్యం లేదంటూ అలక పూనారు. కొందరు బహిరంగ విమర్శలు చేస్తే, ఇంకొందరు భట్టి ఇంట్లో భేటీ అయి.. తమ నిరసన తెలిపారు. అంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే చేశారంటూ.. అంతా ముక్తకంఠంతో ఆరోపించారు.


ఈ అలజడి అంతా ముందే ఊహించిందే. కాంగ్రెస్ లో ఇదంతా కామనే. అందుకే కాబోలు రెండు, మూడు రోజులుగా ఇంత రచ్చ జరుగుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఢిల్లీలో, పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. కొన్నాళ్లు ఆగితే అంతా సర్దుకుంటుందనే ధోరణిలో ఉన్నట్టున్నారు.

బయటపడిందంతా సీనియర్లే. కీలక స్థానాల్లో ఉన్నవారే. పదవుల్లో అన్యాయం జరిగిందనే బాధకంటే.. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోననే భయమే వారిలో ఎక్కువ కనిపిస్తోందని అంటున్నారు. కొండా సురేఖ తనకు మరింత కీలక పదవి రాలేదని, తన వర్గీయులకు డీసీసీ పదవులు రాలేదని అలక బూనారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ నుంచి గెలిచి.. ఓటమి తర్వాత మళ్లీ పార్టీలో చేరిన కొండా సురేఖకు ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఏమిస్తారంటూ కొందరు అంటున్నారు. ఇక, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిన పీజేఆర్ కుమారుడు విష్ణుకు ప్రజల్లో అంతగా బలం లేదని పక్కన పెట్టేశారని అంటున్నారు. ఇక, సో కాల్డ్ సీనియర్స్ తమకు ఏదో జరిగిపోయిందంటూ భట్టి ఇంటికెళ్లి మరీ గోడు వెళ్లబోసుకున్నారని విమర్శిస్తున్నారు.


ఏ పార్టీకైనా కొత్త కమిటీల ఏర్పాటు తర్వాత లుకలుకలు సహజమే. కాకపోతే, కాంగ్రెస్ లో ఆ కల్చర్ మరింత ఎక్కువ. ఈసారి చాలామంది సీనియర్లకు షాక్ తగలడంతో అంతా లబోదిబో మంటున్నారు. పార్టీని రేవంత్ ఆక్రమించేస్తున్నారని.. కమిటీల్లో ఆయన వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, కమిటీ అంతా రేవంత్ టీమ్ తో నింపేయలేదు. కొందరు ఆయన అనుచరులు ఉన్నా.. ఏఐసీసీకి సీనియర్ల ఫిర్యాదుతో పాత కాపులు చాలామందికి మంచి పదవులే వచ్చాయని అంటున్నారు. ఆ పాత నేతలు తనకొద్దంటూ రేవంత్ ఎంతగా మొత్తుకున్నా.. అధిష్టానం వినలేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటు అయి ఉంటే.. జగ్గారెడ్డికి మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వచ్చి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కమిటీ.. పాత-కొత్తల కలయిక అని.. ఇది పక్కా ఏఐసీసీ కూర్పు మాత్రమేనని అంటున్నారు. అయినా, కొందరు సీనియర్లు కావాలనే కిరికిరి చేస్తున్నారనే ఆరోపణ ఉంది. కమిటీ కూర్పునకు తనను పిలవలేదంటూ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క మాటలు ఈ సందర్భంగా చర్చనీయాంశం.

గతంలో సీఎల్పీ లీడర్ గా వైఎస్సార్ ఉన్నప్పుడు.. పీసీసీ చీఫ్ గా డీఎస్ ఉండేవారు. వారిద్దరి అభిప్రాయాలకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చేది. కాకపోతే వైఎస్సార్ కు ఎక్కువ ప్రయారిటీ ఉండేది. అప్పుడు ఏపీ, తెలంగాణ కోటాలో వారిద్దరినీ పార్టీ ప్రోత్సహించిందని అంటారు. సో, అప్పటి పరిస్థితులతో ఇప్పుడు పోల్చలేమంటున్నారు. ఎవరు కాదన్నా.. తెలంగాణ పీసీసీకి రేవంత్ రెడ్డినే సుప్రీం. అధ్యక్షుడిగా ఆయన మాటే ఎక్కువ చెల్లుబాటు అవడం కామన్. ఈసారి కూడా అదే జరిగింది. కొత్త కమిటీల్లో రేవంత్ రెడ్డి అభ్యర్థులకు ప్రాధాన్యం దక్కింది. అంతమాత్రాన మిగతా సీనియర్లకు అన్యాయం జరిగిందని అనుకోలేమని అంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కరినే పక్కకు పెట్టినట్టు కనిపిస్తోంది. మిగతా సీనియర్లకు వారి వారి స్థాన బలం, ప్రజల్లో చరిస్మా మేరకు పదవులు వచ్చాయని.. ఓ వర్గం వాదిస్తోంది. పీసీసీ చీఫ్ కు ఆయన కోరుకున్న టీమ్ ను ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని.. అధిష్టానం అదే చేసిందని చెబుతున్నారు. సీనియర్లే అనవసరంగా కంగారు పడి.. పార్టీలో కుంపటి రాజేస్తున్నారని రేవంత్ వర్గం మండిపడుతోంది.

సీనియర్లు మాత్రం ఈ వాదనను తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కడి సొత్తు కాదని.. దశాబ్దాలుగా తామంతా కలిసి పార్టీని పటిష్టపరిచామని.. అలాంటి తమనే పక్కనపెట్టడం అన్యాయం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కమిటీలపై తాడోపేడో అధిష్టానం దగ్గరే తేల్చుకుంటామని సవాల్ విసురుతున్నారు.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×