EPAPER

Sankranti Buses : పండుగను సొమ్ము చేసుకుంటున్న ట్రావెల్స్.. బస్సులపై 117 కేసులు నమోదు

Hyderabad : సంక్రాంతి పండుగను ప్రైవేట్ ట్రావెల్స్ సోమ్ము చేసుకుంటున్నాయి. సరైనా నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సులో కనీసం ఫైర్ సేఫ్టీని కూడా యాజమాన్యాలు పాటించడం లేదని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.

Sankranti Buses : పండుగను సొమ్ము చేసుకుంటున్న ట్రావెల్స్.. బస్సులపై 117 కేసులు నమోదు

Sankranti Buses : సంక్రాంతి పండుగను ప్రైవేట్ ట్రావెల్స్ సోమ్ము చేసుకుంటున్నాయి. సరైనా నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సులో కనీసం ఫైర్ సేఫ్టీని కూడా యాజమాన్యాలు పాటించడం లేదని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.


మరోవైపు.. పండుగకు ఇంటికి ఎలాగైనా వెళ్లాలన్న ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ బస్సు సంస్థలు ప్రయాణికులు నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. బస్సు ఫిటినెస్ సరిగా లేకపోతే తప్ప టికెట్ రేట్లపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. పండుగకు ఆర్టీసీ బస్సులో ధరలు నిర్ణీతంగా ఉన్నాయి. ధరలు వివరాలు కూడా ఆర్టీసీ అధికారులు ముందే డిస్ ప్లే చేస్తున్నారు. అయితే ఇటువంటి నిబంధనలు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ పాటించడంలేదు.

సంక్రాంతి పండుగ వల్ల మూడు నెలలు క్రిందే రైలు టికెట్‌లు వెయిటింగ్ లిస్ట్‌కు చేరుకున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవెట్ ట్రావెల్స్ టికెట్ ధరలను పెంచి ప్రయాణికుల నుంచి డబ్బును దోచుకుంటున్నాయి. సాధారంగా ట్రైన్ ల్లో థర్డ్ ఏసీ ధర రూ.1200 ఉంటే స్లీపర్ బస్సులో రూ.3500-4000 వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సులో రూ.2500-3000 మధ్య టికెట్ రేట్‌లు ఉన్నాయి. కుటుంబంలో నలుగురు ఉంటే రానుపోను మొత్తం రూ.20వేల రూపాయలుపైగా ఖర్చు అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు యాప్‌లలో యథేచ్ఛగా నడుస్తోంది.


డబ్బుకు తగ్గటుగానే ప్రయాణ సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు ప్రయాణికులను మోసం చేస్తున్నాయి. ప్రయాణికుల మీద దురుసు ప్రవర్తనతో ఎన్నో ఫిర్యాదులు గతంలో నమోదు అయ్యాయి. రెండు రోజులుగా ఆర్టీఏ సిబ్బంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న బస్సులపై కేసులు నమోదు చేసారు. మొత్తం 117 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పన్నులు, ఇతర బకాయిలు కలిపి మొత్తం రూ.4.17 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×