EPAPER

Saddula Bathukamma 2024: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !

Saddula Bathukamma 2024: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !

Saddula Bathukamma 2024 Know About Flower Festival Significance time date Celebrations: తెలంగాణ రాష్ట్రంలో… బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బతుకమ్మ పండుగ మొత్తం… పూలతోనే చేస్తారు. రంగు రంగుల పూలతో బతుకమ్మ పేర్చి… ఊరి నడిబొడ్డున బతుకమ్మ ఆడుతారు మహిళలు. ఇలా తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగ కొనసాగుతుంది. మొదటి రోజున ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ… సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతుంది.


Also Read: IND VS BAN: టీ20 సిరీస్‌పై టీమిండియా కన్ను.. నేడు రెండో టీ20..జట్ల వివరాలు ఇవే

ఈ సారి ఎంగిలి బతుకమ్మ.. అక్టోబర్ మూడవ తేదీన వచ్చింది. అక్టోబర్ 11వ తేదీన అంటే శుక్రవారం రోజున… సద్దుల బతుకమ్మతో పండుగ పూర్తి కానుంది. ఈ రోజున… రకరకాల వంటకాలు చేసుకొని.. చెరువుగట్టున బతుకమ్మ ఆడి… అక్కడే తిని వస్తారు. ఈ సారి బతుకమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా సద్దుల బతుకమ్మ 11 అక్టోబర్ 2024న జరుగుతుంది.


సద్దుల బతుకమ్మ ప్రాముఖ్యత

సద్దుల బతుకమ్మ… తొమ్మిది రోజుల పూల పండుగ చివరి రోజు. తెలంగాణలో అపారమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సద్దుల బతుకమ్మ రోజున ఉత్సవాలు గ్రాండ్‌ గా చేస్తారు. పువ్వులు, పసుపు, వెర్మిలియన్‌లతో అలంకరించబడిన అద్భుతమైన బతుకమ్మను తయారు చేస్తారు. అనంతరం ఊరి చివరగా లేదా చెరువుల దగ్గర పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

Also Read: Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!

సద్దుల బతుకమ్మ ఆచారాలు

చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు తెల్లవారుజామున సన్నాహాలు ప్రారంభిస్తారు. బతుకమ్మ పేర్చిన తర్వాత..అందరూ ఒకే దగ్గర పేర్చి… ఊయల, గౌరమ్మ పాటలతో బతుకమ్మ ఆడతారు. ముఖ్యంగా గౌరమ్మకు పూజలు చేస్తారు. అలాగే సద్దుల బతుకమ్మ రోజున మహిళలు.. నగలు, కొత్త వస్తాలు ధరించి.. సందడి చేస్తారు. బతుకమ్మ పేర్చడం, గౌరమ్మను చేసుకోవడం.. కొత్త వస్త్రాలు ధరించి.. బతుకమ్మ ఆడటం ఆచారంగా తెలంగాణలో మారింది.

బతుకమ్మ పండుగ 2024 షెడ్యూల్

ఎంగిలి పూల బతుకమ్మ: 3 అక్టోబర్ 2024, గురువారం

అటుకుల బతుకమ్మ: 4 అక్టోబర్ 2024, శుక్రవారం

ముద్దపప్పు బతుకమ్మ: 5 అక్టోబర్ 2024, శనివారం

నానాబియ్యం బతుకమ్మ: 6 అక్టోబర్ 2024, ఆదివారం

అట్ల బతుకమ్మ: 7 అక్టోబర్ 2024, సోమవారం

అలిగిన బతుకమ్మ: 8 అక్టోబర్ 2024, మంగళవారం

వేపకాయల బతుకమ్మ: 9 అక్టోబర్ 2024, బుధవారం

వెన్న ముద్దల బతుకమ్మ: 10 అక్టోబర్ 2024, గురువారం

సద్దుల బతుకమ్మ: 11 అక్టోబర్ 2024, శుక్రవారం

Related News

TG DSC 2024: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్

Revanth On Musi River: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్

Hyderabad Metro Rail: మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

Bhatti Vikramarka: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు భట్టి కౌంటర్లు

×