EPAPER

Tummala: మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల

Tummala: మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. రైతు భరోసా ఆగదు: మంత్రి తుమ్మల

– అపోహలు వద్దు.. రైతు భరోసా కొనసాగిస్తాం
– దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీ చేశాం
– పండిన ప్రతీ పంట కొనుగోలు చేస్తాం
– మోసగాళ్ల మాటలు నమ్మొద్దు
– మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు


సిద్దిపేట, స్వేచ్ఛ: రైతు భరోసాపై అపోహలు వద్దని, ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గజ్వేల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఆటంకాలు సృష్టిస్తున్నా, రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ చేయలేని పార్టీలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు భరోసా కొనసాగిస్తామని, ప్రతి గింజ కొనుగోలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మోసగాళ్లు, దగాకోరుల మాటలు నమ్మొద్దని రైతులకు సూచించారు. త్వరలోనే రుణమాఫీ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథాన పయనిస్తోందని వివరించారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న తుమ్మల, పేదలకు సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తున్నామని చెప్పారు.

Also Read: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్


మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రైతులకు లాభపడే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంటుందని అన్నారు. 60 వేల కోట్ల రూపాయల మిగులుతో ఏర్పడిన రాష్ట్రం నేడు 7 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని వివరించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావడం లేదన్నారు. గజ్వేల్‌లోను కేసీఆర్ ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు సరిగ్గా నిధులు ఇవ్వట్లేదన్నారు. వరదలు వచ్చి ఖమ్మం మునిగి రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే 400 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య స్నేహ బంధం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నెలన్నరలోనే కూలిపోతుందని ఆ రెండు పార్టీల నేతలు కామెంట్స్ చేశారని గుర్తు చేశారు పొన్నం.

Related News

Kondakal: కొండకల్ తండాలో ఏం జరుగుతోంది..? ‘స్వేచ్ఛ’ వార్తలతో విషయం వెలుగులోకి..

TG Govt: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ రైతన్నలకు రూ.500 బోనస్.. 48 గంటల్లో డబ్బు జమ

Minister Sridharbabu: వాళ్లతో నష్టపోవడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు: మంత్రి శ్రీధర్ బాబు

Rain Alert: రేపటి నుండి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలలో మాత్రం అంతంత మాత్రమే.. మరికొన్ని జిల్లాలలో..

Harishrao: ఆరునూరైనా అడ్డుకుని తీరుతా.. అవసరమైతే అక్కడికి కూడా వెళ్తా: హరీష్ రావు

CM Revanth Reddy: నిఖత్ జరీన్ ప్రయాణం మనకు స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్

Big Stories

×