EPAPER

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

మాది.. రైతు ప్రభుత్వం


– వ్యవసాయం చేసే వారికే రైతు బంధు
– కౌలు రైతు, భూమి ఓనర్ చర్చించుకోవాలి
– ఎవరికి రైతు బంధు కావాలో వారే నిర్ణయం తీసుకోవాలి
– ఏపీలో ఉన్నట్టు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు
– బీఆర్ఎస్ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ జరిగింది
– మేము 42 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం
– అది కూడా రూ.2 లక్షల దాకా మాఫీ చేశామన్న మంత్రి తుమ్మల

Minister Tummala: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి రావాల్సిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ఎయిర్‌ పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి కోరినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించానన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిశానని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరానని తెలిపారు. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనేది తమ ప్రభుత్వం నిర్ణయంగా చెప్పారు తుమ్మల.


Also Read: Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

పంట ఎవరైతే పండిస్తారో వారికే చేయూత ఇవ్వాలని, అదే సరైనదని పేర్కొన్నారు. కౌలు రైతు, భూమి ఓనర్ చర్చించుకొని ఎవరికి రైతు బంధు కావాలో వారే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవన్న మంత్రి, మన భూ చట్టాలు వేరు, ఏపీలో వేరని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ చేశారని, తాము మాత్రం 42 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్టు చెప్పారు. అది కూడా 2 లక్షల రూపాయల దాకా చేశామని తెలిపారు. రైతు క్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 5 ఏళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇంకా అవసరమైన నిధులు సమకూరుస్తామని, పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ ఇస్తుందని స్పష్టం చేశారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×