EPAPER

Rice Price: తగ్గిన దిగుబడి.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. ఒక క్వింటాలుపై?

Rice Price: తగ్గిన దిగుబడి.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. ఒక క్వింటాలుపై?

Rice Price: ఆదాయం తక్కువ.. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ. సగటు మధ్యతరగతి పౌరుడి ఆవేదన ఇది. నిన్నమొన్నటి వరకూ వంటనూనెలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కితే.. ఇప్పుడు ఆ జాబితాలోకి బియ్యం కూడా చేరాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండటం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిన్నటి వరకూ కిలో బియ్యం ధర రూ.45-50 మధ్య ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరింది. ఇంకొంచి మేలురకమైతే కిలో రూ.70 వరకూ చెల్లించాల్సిందే.


మనం ఎక్కువగా వాడే బీపీటీ, హెచ్ఎంటీ, సోనామసూరి రకాల బియ్యం ధరలు క్వింటాలుపై సుమారు రూ.1000 -1500 వరకూ పెరిగాయి. గతేడాది క్వింటాలు బియ్యం ధర రూ.4500 -5000 మధ్య ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.6200కు పెరిగింది. పాతబియ్యం కావాలంటే.. రూ.7500 ఖర్చు పెట్టాల్సిందే. గతంలో హెచ్ఎంటీ, బీపీటీ కొత్తరకం బియ్యం క్వింటాలు ధర రూ.3300-3500 వరకూ ఉండగా.. ఇప్పుడు రూ.4500కు పెరిగింది. హైదరాబాద్ లో సాధారణరకం 25 కిలోల బస్తా ధర రూ.180-రూ.250 మేర పెరిగి రూ.1350కు చేరుకుంది. క్వాలిటీ బియ్యం బస్తా ధర అయితే రూ.1650-1800 మధ్య పలుకుతోంది.

బియ్యం ధరలు ఇలా పెరగడానికి కారణం.. వరిసాగు తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో వరిసాగు పెరిగినా.. వర్షాభావ పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో వరదలు కారణంగా వరిపంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ప్రతిఏటా సన్నాల సాగు 50 శాతం ఉంటే.. 2023లో మాత్రం 30 శాతమే దిగుబడి వచ్చింది. మున్ముందు ఇవే పరిస్థితులుంటే బియ్యం ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×