EPAPER

RevanthReddy: మళ్లీ కేటీఆర్‌కు, రకుల్‌ప్రీత్‌కు లింకు పెట్టిన రేవంత్.. ఈడీకి కంప్లైంట్..

RevanthReddy: మళ్లీ కేటీఆర్‌కు, రకుల్‌ప్రీత్‌కు లింకు పెట్టిన రేవంత్.. ఈడీకి కంప్లైంట్..

RevanthReddy : TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడినప్పటి నుంచి కాంగ్రెస్ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తోంది. ప్రభుత్వం వైఖరిని ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేయాలని టీపీసీసీ సంకల్పించింది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ పై దర్యాప్తు చేయాలని కోరారు. శనివారం ఏసీబీకి, సీబీఐకి రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు కేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.


పేపర్ లీక్ పై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడొద్దని కోరారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు . కేసీఆర్, కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు.పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు. గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని విమర్శించారు. పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మిని చేర్చాలని డిమాండ్ చేశారు.


పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పరువున్నోళ్లు పరువు నష్టం దావా వేయాలన్నారు. కేటీఆర్ కు చీము నెత్తురుంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ లేఖ రాయాలన్నారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించాడని ప్రశ్నించారు. వంద కోట్లిస్తే కేటీఆర్ ను బూతులు తిట్టొచ్చా? అని అన్నారు. కేటీఆర్ ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్టా? సమంత సిరీస్ కు సంతకం పెట్టినట్టా అగ్రిమెంట్ చేసుకోవడానికి అని ప్రశ్నించారు.

అసలు కేటీఆర్ కు ఎగ్జామ్ రాసినవారి డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కటాఫ్ మార్కులు ఎంతో కేటీఆర్ కు ఎలా తెలుసన్నారు . 415 మంది జగిత్యాల నుంచి గ్రూప్- 1 పరీక్ష రాశారని కేటీఆర్ ఎలా చెప్పారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Big Stories

×