EPAPER
Kirrak Couples Episode 1

RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..

RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..

RevanthReddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోరోజు పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్ .. 2024 జనవరి 1న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో కొత్త విధానాలతో పాలన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపైనా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ అడ్డంగా ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ ను గంజాయిమయంగా మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం సాయం లేకుండా గంజాయి అడ్డాలు తయారవుతాయా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని కనిపెట్టిన ప్రభుత్వానికి.. గంజాయి మాఫియా గురించి తెలియదా అని ప్రశ్నించారు.


తెలంగాణలో విద్యావ్యవస్థ దారుణంగా ఉందని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో చాలా స్కూల్స్ మూసివేశారని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులు తెరిచారని మండిపడ్డారు.
2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్నో దుర్మార్గాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ కు కేసీఆర్ భూతంగా మారారని మండిపడ్డారు. రక్త పిశాచిగా మారి ప్రజల రక్తం తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేసైనా కేసీఆర్ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.

కాంగ్రెస్ లో సహజంగానే నేతలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని రేవంత్ తెలిపారు. స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించే అవకాశం కాంగ్రెస్ లో మాత్రమే ఉంటుందని చెప్పారు. పార్టీలో గ్రూపుల గురించి పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేసీఆర్ విధానాలను బలంగా వ్యతిరేకించేవారికి అసెంబ్లీ బరిలో దిగే అవకాశం దక్కుతుందన్నారు. దుర్మార్గులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని స్పష్టంచేశారు.


కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు ప్రజల్లో భరోసా కల్పించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర మూడోరోజు కొనసాగుతోంది.పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరణ అనంతరం మూడో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈదులపూసపల్లి గ్రామంలో రైతులతో మాట ముచ్చట నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ పట్టణానికి పాదయాత్ర చేరుతుంది. ఆ తర్వాత తొర్రూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×