EPAPER
Kirrak Couples Episode 1

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Pravasi Prajavani: తెలంగాణ నుంచి ఉపాది కోసం పెద్ద ఎత్తున యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఏజెంట్ల మాయంలో అక్కడి వెళ్లి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి బయటపడలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు లేకపోలేదు. ఫలితంగా గల్ఫ్ వెళ్లే బాధిత కుటుంబాటు అప్పులపాలై రోడ్డున పడుతున్నారు.


వీరి కోసం రేవంత్ సర్కార్ తొలిసారి ప్రవాసి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రత్యేక కౌంటర్ ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుండి తొలి అభ్యర్థనను స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గల్ఫ్‌లో చనిపోయినవారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసింది. ఆయా కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకుల పాఠశాలలో సీట్లు ప్రత్యేకంగా ఇవ్వనుంది.


గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారికి అక్కడి చట్టాలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కంపెనీలపై అవగాహన కల్పించనున్నారు.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు, ఇతర ఎన్నారై విభాగం నేతలు హాజరయ్యారు.

 

 

Related News

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

Reliance: రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, సీఎం సహాయనిధికి 20 కోట్లు..

Vijaya Dairy: విజయ డెయిరీని గత ప్రభుత్వం ముంచిందా? డెయిరీ ఛైర్మన్ అమిత్ ఏమన్నారు?

Abids Taj Mahal Hotel: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?

Bhatti Vikramarka: కొత్త లుక్‌లో భట్టి విక్రమార్క… ప్యాంట్, షూట్‌ వేసి అమెరికాలో హల్చల్

Big Stories

×