EPAPER

Revanth Reddy Cabinet Expansion: రేవంత్ కేబినెట్ విస్తరణ.. వాళ్లకే ఛాన్స్..

Revanth Reddy Cabinet Expansion: రేవంత్ కేబినెట్ విస్తరణ.. వాళ్లకే ఛాన్స్..

Revanth Reddy Cabinet Expansion: రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో బెర్త్‌ల కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైందా? చోటు దక్కని సీనియర్లు ఈసారి మంత్రి పదవులపై కన్నేశారా? దీనికోసం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారా? వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు రేసులో ఉన్నారా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలతో పలువురు సీనియర్లు మంతనాలు జరిపినట్టు సమాచారం. కాకపోతే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ అంశం ఓ కొలిక్కిరావచ్చని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ చివరలో కేబినెట్ విస్తరణ ఉంచవచ్చనే సంకేతాలు లేకపోలేదు.


ఈసారి ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారనేది తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. రాజ్యాంగం పద్దతి ప్రకారం సీఎంతో కలిసి 18 మందికి మించరాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులున్నారు. మరో ఆరుగురు ఛాన్స్ ఉందన్నమాట. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, ముదిరాజ్‌‌, మైనార్టీ వర్గాలతో కలిసి మొత్తం ఆరుగురికి అవకాశం ఇవ్వడం ఖాయం.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు. సరైన పనితీరు కనబరచని మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రేవంత్ కేబినెట్‌లో ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులున్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్ నుంచి ఇద్దరేసి మంత్రులున్నారు.


Also Read: ల్యాండ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరు లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇక రంగారెడ్డి జిల్లా విషయానికొస్తే పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. ఈ వ్యవహారమంతా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జులైలో జరగాలి. కానీ ఆ సమయంలో జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే రైతుబంధు పథకానికి నిధులు ఆగస్టులో వేస్తామని రేవంత్ సర్కార్ చెప్పింది. ఆ లెక్కన చూస్తే సెప్టెంబరులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం ఖాయమని పలువురు నేతలు చెబుతున్నమాట.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×