EPAPER

Revanth Reddy Spirit | బలమైన సంకల్పానికి మారుపేరు రేవంత్ రెడ్డి

Revanth Reddy Spirit | చాలా మంది జీవితంలో చాలా లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. అయితే అనుకున్నవన్నీ జరగవు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు.. ఎప్పుడో యుక్తవయసులో సీఎం అవ్వాలని అనుకుని ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునేదాకా రేవంత్ రెడ్డి పడ్డ కష్టం ఎంతో ఉంది. దూర దృష్టి ఉంది. బలమైన సంకల్పం ఉంది. అంతే అసాధ్యం సుసాధ్యమైంది.

Revanth Reddy Spirit | బలమైన సంకల్పానికి మారుపేరు రేవంత్ రెడ్డి

Revanth Reddy Spirit | చాలా మంది జీవితంలో చాలా లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. అయితే అనుకున్నవన్నీ జరగవు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు.. ఎప్పుడో యుక్తవయసులో సీఎం అవ్వాలని అనుకుని ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునేదాకా రేవంత్ రెడ్డి పడ్డ కష్టం ఎంతో ఉంది. దూర దృష్టి ఉంది. బలమైన సంకల్పం ఉంది. అంతే అసాధ్యం సుసాధ్యమైంది.


రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఇండియాలో ఇదే పేరు మార్మోగుతోంది. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా.. ఎక్కడా జరగని చర్చ తెలంగాణ కొత్త సీఎం గురించే జరుగుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సాగించిన పొలిటికల్ జర్నీ అలాంటిది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే సీఎం అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే అది అంత సులువా కష్టమా అన్నది ఆలోచించలేదు. సుదూర లక్ష్యం. అయినా సరే ఎక్కడా తడబడలేదు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు.

రేవంత్ వాక్చాతుర్యం, అన్ని సబ్జెక్టులపై అవగాహన, అనుసరించే వ్యూహాలు ఇవన్నీ ఆయనను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ తీసుకొచ్చాయి. చెప్పాలంటే ఆ మెట్లు ఆయనే ఏర్పాటు చేసుకున్నారు. జీవితంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. రేవంత్ విషయంలో అదే జరిగింది. రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. జరిగిపోయింది. సీఎ అవ్వాలనుకున్నారు జరిగిపోయింది. ఒక లీడర్ కు ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అవన్నీ నిండుగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.


పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి జర్నీ అంతా సంచలనాలతోనే ముడిపడి ఉంది. జడ్పీటీసీగా గెలవడం దగ్గర్నుంచి ఎమ్మెల్సీగా గెలవడం, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా అన్నిట్లో సంచలనాలు సృష్టించారు. ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ స్థాయికి రావడం అంటే మాటలు కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. రాజకీయ వారసత్వం లేదు. అయినా అనుకున్నది సాధించారు రేవంత్.

రేవంత్ పొలిటికల్ జర్నీ ఏబీవీపీ నుంచి మొదలైంది. పాఠశాల విద్య వనపర్తి ప్రభుత్వ స్కూల్ లో కొనసాగింది. అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశారు. 1992 నుంచి విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో అంటే.. 2004లో అప్పటి టీఆర్ఎస్ లో రేవంత్ పని చేశారు. 2006లో నాటి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే అది రేవంత్ సొంతూరు కాదు. పైగా టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ స్వతంత్రంగా గెలిచారు.

ఇక 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. దీంతో అక్కడ కూడా రేవంత్ ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. గెలిచారు. దీంతో యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా రేవంత్ పేరు మార్మోగడం అదే తొలిసారి. ఒక ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో నిలిచి సాధించిన విజయం రేవంత్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. శాసన మండలిలో ఆయన చేసిన ప్రసంగాలు, ప్రస్తావించిన అంశాలు అందరినీ ఆకర్షించాయి. పెద్దల సభలో యువకుడిగా ఎంటరై తక్కువ సమయంలోనే అందరినీ ఆకట్టుకున్నారు. చివరికి చంద్రబాబు దృష్టిలో పడ్డారు. వాగ్ధాటి నచ్చి పార్టీలో చేర్చుకున్నారు.

2009లో రేవంత్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అది కూడా ఆయన సొంతూరు కాదు. రేవంత్ ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం మనసులు గెలుచుకున్నారు. అందుకే ఎవరికీ సాధ్యం కాని విజయాలు ఆయనకే దక్కాయి. కొడంగల్ లో అయితే తొలిసారి పోటీ చేసినప్పుడు కేవలం 17 రోజులే ప్రచారం చేశారు. అయినా విజేతగా నిలిచారు. ఒక పవర్ ఫుల్ లీడర్ కు పదవుల కోసం వెతుక్కునే అవసరం ఉండదు. పదవులే వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఇది రేవంత్ విషయంలో వందకు వందశాతం నిరూపితమైంది.

ఒక ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ మాదిరిగానే రేవంత్ రెడ్డి లీడర్ షిప్ విషయంలో దూసుకొచ్చారు. 2014లోనూ మరోసారి కొడంగల్ నుంచే గెలిచారు. అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రేవంత్ సభలో తనవంతు పాత్ర పోషించారు. 2018లో ఓడిపోయినా.. 2019లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి సెగ్మెంట్ నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. అది కూడా రేవంత్ స్వస్థలం కాదు. మల్కాజ్ గిరి అంటే ఒక మినీ ఇండియా. అయినప్పటికీ అందరికీ ఫేవరెట్ లీడర్ అయ్యారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×