EPAPER
Kirrak Couples Episode 1

Gig Workers: గిగ్ వర్కర్లలో ఆశల మోసులు

Gig Workers: గిగ్ వర్కర్లలో ఆశల మోసులు

Gig Workers: ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన గిగ్ వర్కర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సమావేశం నిర్వహించడమే కాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా వారి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రం గత బడ్జెట్‌లోనే గిగ్ వర్కర్ల కోసం పలు చర్యలు తీసుకుంటుందని అందరూ ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఇంతకీ గిగ్ వర్కర్ల డిమాండ్లు ఏమిటి? దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా వారి పాత్ర ఎలా ఉంది? గిగ్ ఎకానమీ అంటే ఏమిటో తెలుసుకుందాం.


గిగ్ వర్కర్లకు దారేది?

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో జాబ్ మార్కెట్ ముఖచిత్రమే మారిపోతోంది. గ్రేట్ రిజిగ్నేషన్, మూన్ లైటింగ్, లేఆఫ్‌ల దరిమిలా అనువైన వేళల్లో, అవసరమైన మేర పనిచేసే విధానం ఊపందుకుంది. అంతిమంగా ఇది దేశంలో గిగ్ ఎకానమీకి బాటలు పరిచింది. సరళతర హైరింగ్, స్వల్పకాలిక పని విధానంతో పాటు వర్కర్‌కు పూర్తి స్వతంత్రత లభించడం గిగ్ వర్కింగ్ ఊపందుకొనేందుకు ప్రధాన కారణాలు.


2030కి మూడు రెట్లు

గిగ్ ఆర్థిక వ్యవస్థ లక్షలాది కార్మికులకు దారి చూపుతోంది. 2020-21 నాటికే భారత్‌లో వీరి సంఖ్య 77 లక్షలకు చేరిందని నీతి ఆయోగ్ నివేదించింది. 2029-30 నాటికి గిగ్ వర్కర్ల సంఖ్య 2.35 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 1920లో జాజ్ మ్యుజీషియన్లు తొలిసారిగా గిగ్ పదాన్ని వాడుకలోకి తెచ్చారు. ‘ఎంగేజ్‌మెంట్’ అనే పదానికి వారు ఇచ్చిన సంక్షిప్త రూపమే గిగ్. 2010లో ఉబెర్ యాప్ అందుబాటులోకి వచ్చినప్పుడు.. ఈ పదానికి విస్తృత ప్రాచుర్యం లభించింది. అప్పటికే భారీ లేఆఫ్‌ల ద్వారా సిబ్బందిని తగ్గించుకున్న కార్పొరేట్ సంస్థలు.. అవసరాలకు తగ్గట్టు తాత్కాలిక నియామకాలకు తెర లేపాయి. గిగ్ వర్కర్ల రూపంలో సమర్థులైనవారు చౌకగా లభించారు. నాటి నుంచి గిగ్ ఎకానమీ విస్తృతమవుతూ వస్తోంది. జీవనోపాధి కోసం ఒకటి కంటే ఎక్కువ పనులు చేసే గిగ్ వర్కర్ల సంఖ్య కూడా దాంతో పాటే పెరిగింది.

అగ్రరాజ్యంలో 6 కోట్ల మంది..

అమెరికా ఉద్యోగుల్లో 39% గిగ్ వర్కర్లే. అక్కడ దాదాపు 6 కోట్ల మంది వరకు ఇలా స్వల్పకాలిక కొలువుల్లో పనిచేస్తున్నారు. 2027 నాటికి వీరి సంఖ్య 8.56 కోట్లకు చేరుతుందని అంచనా. గిగ్ వర్క్ అనేది ఓ పెద్ద పరిశ్రమగా రూపుదిద్దుకొంటోంది. టెక్నాలజీ, అకౌంటింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, పాలన, విద్యారంగాల్లో, వివిధ పరిశ్రమల్లో గిగ్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు. వీరికి అదనంగా.. ఒకే సమయంలో రెండు లేదా మూడు కంపెనీలకు పనిచేసే ఫ్రీలాన్సర్లు 76% వరకు ఉన్నారు. గిగ్ లేదా ఫ్రీలాన్స్ వర్కర్లలో 94 శాతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పని వెతుక్కున్నవారే కావడం విశేషం. సంప్రదాయ సిబ్బంది కన్నా గిగ్ వర్కర్లే సమర్థంగా పనిచేస్తారని 38% కంపెనీలు అభిప్రాయపడ్డాయని ఫైవర్ సర్వే తేల్చింది.

వర్ధమానదేశాల్లో ఎక్కువ

గిగ్ ఎకానమీ, దాని ఆధారంగా పనిచేసేవారు ఇబ్బడిముబ్బడిగా పెరగడంలో స్టార్టప్‌లది కీలక పాత్ర. ఫుడ్ డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లను ఇందుకు ఉదాహరించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. వర్థమాన దేశాల్లో గిగ్ ఎకానమీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 1-4%గా ఉంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గిగ్ ఎకానమీ పురోగతి 5-12 శాతంగా ఉందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనంలో తేలింది. స్వల్ప వేతన కొలువుల్లోనే గిగ్ వర్కర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆహారం, వస్తువుల చేరవేత(డెలివరీస్), రైడ్ షేరింగ్, వెల్‌నెస్, కేర్ తదితర కొలువుల ద్వారా గిగ్ వర్కర్లు పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నారు. ఈ సంఖ్య పెరుగుతున్న కొద్దీ గిగ్ వర్కర్ల సమస్యలకు పరిష్కారం చూపక తప్పదు. వారికి సామాజిక భద్రతతో పాటు కనీస వేతనం, పన్ను మినహాయింపులు కల్పించాలి. అలాగే నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఏం కోరుకుంటున్నారు?

దేశంలోని సామాజిక భద్రతా చట్టాల కింద రక్షణ కల్పించాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ వెల్ఫేర్ సెక్యూరిటీ యాక్ట్, 2008 కింద వారిని అసంఘటిత కార్మికులుగా గుర్తించాలన్న డిమాండ్ కూడా ఉంది. సామాజిక భద్రతా పథకాలు, కనీస వేతన చట్టం, పన్ను రాయితీలను వర్తింపచేయాలని, ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనేది గిగ్ వర్కర్ల ప్రధాన డిమాండ్లు. గిగ్ వర్కర్లను నియమించుకునే ఎంటర్‌ప్రైజెస్, ఎంఎస్ఎంఈ సంస్థలకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ప్రకటించాలని, సరళతర రుణాలు కల్పించాలనే డిమాండ్ ఉంది. గిగ్ ఎకానమీలో యువత భాగస్వామ్యం గత నాలుగేళ్లలోనే ఎనిమిది రెట్లు పెరిగినట్లు గిగ్ వర్క్ ప్లాట్‌ఫామ్ టాస్క్‌మో నివేదించింది. టైర్-1 నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబైల్లో యువత ఎక్కువగా గిగ్ జాబ్ రోల్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాంటి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే.. ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.

Tags

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

Big Stories

×