EPAPER

Revanth Reddy Congress | కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ప్రయాణం.. అంత సులువు కాదు!

Revanth Reddy Congress | పార్టీలో చేరిన ఏడాదికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు. పార్టీలో చేరిన నాలుగేళ్లకే టీపీసీసీ పగ్గాలు… పార్టీలో చేరిన ఆరేళ్లకే సీఎం పదవి. ఇదీ ఎనుముల రేవంత్ రెడ్డి స్పీడ్. ఇందులో ఏ పదవి వెనుకా రేవంత్ పడలేదు. అవే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. గట్స్ ఉన్న లీడర్ కాబట్టే పదవులన్నీ క్యూ కట్టాయి. అయితే వాటికి విలువ ఇస్తూ రేవంత్ పొలిటికల్ జర్నీ ముందుకు సాగింది. చేపట్టిన ఏ పదవి అయినా వాటికి వన్నె తీసుకొచ్చారాయన.

Revanth Reddy Congress | కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ప్రయాణం.. అంత సులువు కాదు!

Revanth Reddy Congress | పార్టీలో చేరిన ఏడాదికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు. పార్టీలో చేరిన నాలుగేళ్లకే టీపీసీసీ పగ్గాలు… పార్టీలో చేరిన ఆరేళ్లకే సీఎం పదవి. ఇదీ ఎనుముల రేవంత్ రెడ్డి స్పీడ్. ఇందులో ఏ పదవి వెనుకా రేవంత్ పడలేదు. అవే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. గట్స్ ఉన్న లీడర్ కాబట్టే పదవులన్నీ క్యూ కట్టాయి. అయితే వాటికి విలువ ఇస్తూ రేవంత్ పొలిటికల్ జర్నీ ముందుకు సాగింది. చేపట్టిన ఏ పదవి అయినా వాటికి వన్నె తీసుకొచ్చారాయన.


టీటీడీపీలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటయ్యాక.. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా.. తన రూటు మార్చేశారు. 2014 – 2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ గా పని చేశారు. రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్ రెడ్డిని ఓడించడం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా ఆయన పేరు మార్మోగిపోయింది. తెలంగాణలో టీడీపీకి పెద్దగా స్కోప్ లేకుండా పోవడంతో తన దారి మార్చుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయించుకుని 2017లో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. హస్తం పార్టీలో అన్నీ తానై వ్యవహరించారు. విజయతీరాలకు చేర్చారు.

2017లో పార్టీలో చేరగానే.. 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు రేవంత్. 2021, జూన్ 26న హైకమాండ్ రేవంత్ ను టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించింది. నిజానికి చాలా మంది రేవంత్ ఎలివేషన్ కు అడ్డు పడ్డారు. చాలా మంది అలిగారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నామని తమను కాదని కొత్తగా చేరిన వారికి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కానీ హైకమాండ్ మాత్రం పూర్తిగా రేవంత్ రెడ్డినే నమ్మింది. అటు రేవంత్ కూడా తన పదవి తీసుకుని అలాగే ఉండిపోలేదు… పదవి చేపట్టడానికి ముందు చాలా మంది సీనియర్లను కలిసి సపోర్ట్ ఇవ్వాలన్నారు. కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. అన్నట్లుగానే అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చారు. అవసరమైన చోట తగ్గారు. నిలబడాల్సిన చోట ముందున్నారు. చివరకు తగ్గారు.. నెగ్గారు ఇదీ రేవంత్ రెడ్డి స్టైల్.


2017లో హస్తం పార్టీలో రేవంత్ జాయిన్ అయ్యాక 2018లో రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారు. 2018లో సరూర్ నగర్ స్టేడియం సభలో రేవంత్ ను చూసి కార్యకర్తల జోష్, వాయిస్ ఒక్కసారిగా పెరగడం చూశారు రాహుల్. వైఎస్ఆర్ తర్వాత రేవంత్ రెడ్డిలో ఆ స్థాయి మాస్ లీడర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తించారు రాహుల్. జనంలో క్రేజ్, పార్టీలో స్పార్క్ అవసరం అనుకున్నారు. అప్పటి నుంచి రేవంత్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి దూకుడు, ఉత్సాహం, పట్టుదల, పోరాట స్ఫూర్తి ఇవన్నీ హైకమాండ్ కు చాలా నచ్చాయి. రేవంత్ ను పీసీసీ చీఫ్ గా ప్రకటించడం రేవంత్ కు ఎలా ప్లస్ అయిందో.. అదే నిర్ణయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ ప్లస్ అయింది.

కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలంలోనే అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ అభిమానాన్ని రేవంత్‌ సంపాదించుకున్నారు. తెలంగాణలో 21 రోజుల పాటు సాగిన రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రను విజయవంతం చేయడం రేవంత్ రాజకీయంగా ఎదగడంలో చాలా ఉపయోగపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా వద్ద ప్రారంభమైన పాదయాత్ర నిజామాబాద్‌ జిల్లా మద్నూర్‌లో ముగిసేవరకు.. సక్సెస్ ఫుల్ అవడంలో కీలకపాత్ర పోషించారు రేవంత్.

నిజానికి రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు ఇచ్చే నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉంది. అప్పటికే హస్తం పార్టీ నుంచి గెలిచిన 12 మంది గులాబీ పార్టీలో చేరిపోయారు. మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారితోనే కేసీఆర్ పై వ్యతిరేక పోరాటాన్ని నిర్మించారు. ఓవైపు బీజేపీ చాలా దూసుకొచ్చింది. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా మారింది కూడా. జీహెచ్ఎంసీ గెలిచినంత పని చేసింది. అప్పుడు కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. హుజురాబాద్, దుబ్బాక బైపోల్స్ గెలిచి బీజేపీ బరిలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ పని అయిపోయిందా అనుకున్న సమయం. అయితేనేం.. ఎక్కడో ఉన్న పార్టీని ఇప్పుడు అధికారం వరకు తీసుకొచ్చారు రేవంత్.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పుంజుకుంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకూ బలహీన పడింది. ఇందులో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పని చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతమేనా అన్న డౌట్లు సామాన్య కార్యకర్తకూ వచ్చాయి. రెండో టర్మ్ లో అంటే 2018లో హస్తం పార్టీ ఓడిపోయాక ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఎవరి మాట ఎవరు వినే సిచ్యువేషన్ లేకుండా పోయింది. 12 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కారెక్కిన సందర్భం. కాంగ్రెస్ పక్షాన్నే బీఆర్ఎస్ లో విలీనం చేసిన దయనీయ పరిస్థితి. చాలా మంది గులాబీ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ లో ముఖ్య నాయకులంటూ పెద్దగా లేకుండా పోయారు. 2018 -19లో కొందరు కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. ఒక పార్టీ మంచి ఫాంలో ఉండగా చేరి.. పదవులు దక్కించుకోవడం వేరు.. ఆల్ మోస్ట్ పాతాళానికి పడిపోయిన పార్టీలో చేరి పదవులు తీసుకోవడం వేరు. అప్పటి వరకు టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి సరిగ్గా హస్తం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో చేరారు. అప్పటికే దూకుడు స్వభావమున్న రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మారిన తరువాత మరింత స్పీడ్ పెంచారు.

పార్టీని ఎలా నడపాలో రేవంత్ కు చాలా క్లారిటీ ఉంది. ఎలా ఫాంలోకి తీసుకురావాలి.. అసంతృప్త నేతలను ఎలా కలుపుకొని వెళ్లాలి.. ఇవన్నీ బాగా తెలిసిన నేత. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రజల్లోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ తరువాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనూ బహిరంగ సభ పెట్టి గులాబీ పార్టీలో గుబులు పుట్టించారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కేడర్లో ఈ సభలతో ఒక్కసారిగా ఊపు తెచ్చినట్లయింది.

అంతటితో ఆగకుండా.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిరసనల ద్వారా తెలియజేస్తూ జనంలోనే ఉన్నారు రేవంత్. ప్రజలను ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో చూడండి అంటూ జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో నిరసనలు చేయించారు. రైతులు దొడ్డు రకం ధాన్యం వేయవద్దని.. సన్నరకాలు సాగు చేయాలని, వరి వేస్తే ఉరే అని కేసీఆర్ చెప్పినప్పుడు.. ఆయన ఫాం హౌస్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు రేవంత్ ను మధ్యలోనే అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా తన చాకచక్యంతో కేసీఆర్ కు సంబంధించిన పంట సాగు ఫొటోలను తీయించి బయటపెట్టారు. తెలంగాణ రైతులను వరి వేయవద్దని చెప్పిన కేసీఆర్.. స్వయంగా వరి వేసిన పరిస్థితిని జనం ముందు పెట్టారు.

కొన్ని సందర్భాల్లో సీనియర్ల పూర్తిస్థాయి మద్దతు లభించకపోయినా రేవంత్ ఎక్కడా తగ్గలేదు. ప్రతి విషయంలోనూ దూసుకెళ్లారు రేవంత్. కేసీఆర్ సర్కార్ నిర్ణయాలను ఎండగట్టారు. తప్పును తప్పు అన్నారు. ఓఆర్ఆర్ టెండర్ల లీజును తప్పు బట్టారు. కేటీఆర్ జన్వాడ ఫాంహౌజ్ పై పెద్ద పోరాటమే చేశారు. ఫాంహౌజ్ తనది కాదు అని కేటీఆర్ చెప్పినా.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా ముందు పెట్టారు. అప్పుడూ కేసులు ఎదుర్కొన్నారు. ధరణి లోపాలను బయటపెట్టారు. ఎవరు నడిస్తున్నారో చెప్పారు. నిజాం భూములు ఎలా అన్యాక్రాంతం అయ్యాయో వివరించారు. ఒక్కటేమిటి రేవంత్ చేయని పోరాటం లేదు. బెల్టు షాపులనూ వ్యతిరేకించారు. తాగుబోతుల తెలంగాణగా కేసీఆర్ మార్చేశారని ఫైర్ అయ్యారు. తాను పోరాటం చేయడమే కాదు… పోరాడే పార్టీ కాంగ్రెస్ అని జనంలో హైలెట్ చేశారు. పైగా కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తామే అని జనంలో నానేలా చూసుకున్నారు. వీటికి తోడు రాహుల్ గాంధీ ఎంకరేజ్ వల్ల మరింత స్పీడ్ పెంచారు.

రేవంత్ ను రాహుల్ గాంధీ పూర్తిస్థాయిలో నమ్మారు. ఆ నమ్మకం నిలబడింది. 2019లో మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ గెలిచాక.. పార్లమెంట్ లో మరింతగా రాహుల్ తో కలిసి చర్చించే అవకాశం దొరికింది. రక్షణ శాఖ స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టేటివ్‌ కమిటీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీ, వాతావరణ మార్పు తదితర కమిటీలలో సభ్యుడిగా రేవంత్ పని చేశారు. ఇందులో రాహుల్ తో కలిసి ఉన్న కమిటీలూ ఉన్నాయి.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×