EPAPER

Hyderabad development more funds: హైదరాబాద్ సిటీకి కాసుల గలగల.. కేటాయింపుల వెనుక..

Hyderabad development more funds: హైదరాబాద్ సిటీకి కాసుల గలగల.. కేటాయింపుల వెనుక..

Hyderabad development more funds: తెలంగాణ బడ్జెట్‌లో హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్. ఏకంగా 10 వేల కోట్ల రూపాయలను కేటాయించడంతో నగరవాసులు హ్యాపీగా ఫీలవుతున్నారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ స్థాయిలో నిధులు ఎప్పుడూ కేటాయించలేదన్నది ప్రజల మాట.


ఇందుకు కారణాలు లేకపోలేదు. హైదరాబాద్ సిటీలో ప్రతీ ఏడాది జనాభా పెరుగుతోంది అందుకు తగ్గట్టుగా సదుపాయాలు లేవన్నది పాలకపక్షం మాట. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించామని చెబుతోంది. వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. నిధుల కేటాయింపు అధికార పార్టీ కలిసి వస్తుందన్నది నేతల మాట.

రెండోవైపు తెలంగాణలో జనాభా పెరుగుదలను పరిశీలిస్తే.. మిగతా జిల్లాల కంటే హైదరాబాద్ సిటీలో జనాభా క్రమంగా పెరుగుతోంది. 2026లో నియోజక వర్గాల పునర్విభజన ఉంది. ప్రస్తుతమున్న 119 సీట్ల నుంచి 150కి పైగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. సీట్ల పెంపు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటుందని సమాచారం. అది జరిగితే పాలక పక్షానికి తిరుగులేదని అంటున్నారు.


ALSO READ: 90రోజుల్లోనే 31వేల ఉద్యోగ నియామక పత్రాలు.. సీఎం రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కంటే బాగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నా రు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాలకపక్షం భారీ ఎత్తున నిధులను బడ్జెట్‌లో కేటాయించినట్టు చెబుతున్నారు. రాబోయే మూడేళ్లు ఈ విధంగా కేటాయింపులు ఉంటాయన్నది అధికారులు చెబుతున్నమాట. రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు మహర్దశ పట్టడం ఖాయం.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×