EPAPER

Warangal tims: హైదరాబాద్,వరంగల్ టిమ్స్‌ నిర్మాణం.. విజిలెన్స్‌ విచారణ

Warangal tims: హైదరాబాద్,వరంగల్ టిమ్స్‌ నిర్మాణం.. విజిలెన్స్‌ విచారణ

Warangal tims: బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మరోవైపు విద్యుత్ కోనుగోలు, తాజాగా వరంగల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం వంతైంది. టిమ్స్ వ్యయం అమాంతంగా పెంచడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్.


అసలేం జరిగింది ఇంకా లోతుల్లోకి వెళ్తే.. వరంగల్‌లో టిమ్స్ నిర్మాణానికి అప్పటి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 135 ఏళ్ల చరిత్ర కలిగిన జైలును తొలగించి దాని స్థానంలో ఆసుపత్రికి నడుం బిగించిం ది. వరంగల్‌లో 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మొదలైంది.

1100 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం మొదలైంది. రెండు సార్లు అంచనా వ్యయాన్ని అమాంతంగా  1726 కోట్లకు పెంచేసింది. దీనికి సంబంధించిన జీవోలను సీక్రెట్‌గా ఉంచింది. రేవంత్ సర్కార్ వచ్చాక ఆసుపత్రి నిర్మాణంపై రివ్యూ చేసింది. ఈ క్రమంలో అంచనాలు పెంచిన వ్యవహారం బయటవచ్చింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. వరంగల్‌ ఆస్పత్రి స్థలం మార్టిగేజ్‌పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.


ALSO READ: కవిత బెయిల్‌పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టుపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. కొద్దిరోజుల కిందట వరంగల్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ అంచనాల పెంపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. తాజాగా విజిలెన్స్ విచారణకు మూడురోజుల కిందట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదేకాకుండా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మూడు టిమ్స్ భవనాలపై కూడా విజిలెన్స్ విచారణ చేయించాలని నిర్ణయించింది. ఎల్‌బీనగర్‌లో టిమ్స్ 900 కోట్లు, సనత్‌నగర్-882 కోట్లు, ఆల్వాల్-897 కోట్లు రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఈ మూడు ఆసుపత్రులకు 2679 కోట్ల అంచనా వ్యయాన్ని 3562 కోట్లకు పెంచినట్టు అంతర్గత సమాచారం.

దీంతోపాటు 17 మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రుల నిర్మాణ పనులను పెండింగ్‌లో పెట్టింది. విజిలెన్స్‌ విచారణలో లెక్కలు తేడాలు వస్తే.. న్యాయ విచారణ జరిపించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతల చుట్టూ ఉచ్చు బిగిసుకుటుందనే చెప్పవచ్చు.

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×