EPAPER

Hyderabad City: హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్

Hyderabad City: హైదరాబాద్ సిటీ ఇకపై నాలుగు కార్పొరేషన్లు, రేవంత్ సర్కార్ ప్లాన్

Hyderabad City: దేశంలోని నగరాల్లో జనాభా ఏడాదికేడాది క్రమంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మౌళిక సదుపాయాల కొరత ఏర్పడుతోంది.  ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు లేకపోలేదు.


దీంతో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కబ్జాలు, ఆక్రమణలు విచ్చల విడిగా పెరిగిపోయాయి. పరిస్థితి గమనించిన తెలంగాణ సర్కార్ హైదరాబాద్ సిటీపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది. దీంతో మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సిటీ జనాభా 76 లక్షల పైమాటే. గడిచిన 15 ఏళ్లలో జనాభా దాదాపు కోటిన్నర చేరినట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం ఓఆర్ఆర్ పరిధిలో ఉంటున్నారు. మరో నాలుగేళ్లలో 50 శాతానికి చేరుకోవచ్చన్నది ఓ అంచనా.


ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న ఏడు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి కూడా పెరిగింది.  జీహెచ్‌ఎంసీ శివార్లలో మంచి నీరు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. కట్టడాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.

ALSO READ: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

దీన్ని గమనించిన రేవంత్ సర్కార్, బడ్జెట్‌లో 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తూ పోతోంది. హైడ్రా విస్తరణ, మూసీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ సిటీలో లేక్‌లపై చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది.

లేటెస్ట్‌గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను నాలుగు కార్పొరేషన్లుగా విభజించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.  ఈ లెక్కన కసరత్తు జరుగుతోందన్న మాట.

శుక్రవారం మాదాపూర్‌లో అసోచాం ఆధ్వర్యంలో జరిగిన అర్భన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమిత్‌లో ఈ వ్యాఖ్యలు చేశారాయన. హైదరాబాద్ దశ-దిశ మార్చాలన్నదే రేవంత్ సర్కార్ ఆలోచన తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కార్పొరేషన్ల అంశం ఓ కొలిక్కి రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఒక రూపు రావచ్చని చెబుతున్నారు.

Related News

Madhavaram Krishna Rao: కేసీఆర్ కి బిగ్ షాక్.. మూసీ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Olympics In Hyderabad: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

Hyderabad City Development: భాగ్యనగరానికి మహర్దశ – 6 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ఏయే ప్రాంతాల్లో నిర్మిస్తారంటే..

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

Big Stories

×