EPAPER

Musi Oustees: రెండు దశల్లో మూసీ పునరుజ్జీవనం.. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు?

Musi Oustees: రెండు దశల్లో మూసీ పునరుజ్జీవనం.. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు?

Musi Oustees: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలన్నది ఆలోచన. మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండో దశ కార్యాచరణ మొదలుపెట్టాలని భావిస్తోంది.


మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై చకచకా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నదీ గర్భంలో 1600 ఇళ్లు, బఫర్ జోన్‌లో 13 వేళ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. అయితే బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు పరిహారం కిందట 25 వేల రూపాయలను ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాదు ఉపాది కోసం 2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెల్సిందే.

ఇదికాకుండా ఇంటి స్థలం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ఆలోచన.  ఔటర్ రింగ్ రోడ్డు నాలుగు వైపులా ఇళ్ల స్థలాలను ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఈనెల 26న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.


కుటుంబానికి 150 నుంచి 200 గజాల చొప్పున ప్లాన్ ఇవ్వాలని భావిస్తోంది. మార్కెట్లో ఆ స్థలం విలువ అక్షరాలా 25 లక్షల పైమాటేనని అధికారులు అంటున్నారు. వీటి కోసం 600 ఎకరాలు అవసరమని అంచనా వేస్తోంది. ఒకవిధంగా చెప్పుకోవాలంటే మూసీ నిర్వాసితులకు ఇదొక బంపరాఫర్ అన్నమాట.

ALSO READ: రోడ్డెక్కిన మల్లన్న సాగర్ బాధితులు.. హరీష్ రావుకు వార్నింగ్

హైదరాబాద్ చుట్టు పక్కల చాలా చోట్ల ప్రభుత్వ భూములున్నాయి. అందులో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నవి ఉన్నాయి. ఆయా భూములనే ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.

మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండో దశ కార్యాచరణ మొదలు పెట్టాలని భావిస్తోంది. తొలి దశలో మూసీకి ఇరువైపులా రిటెయినింగ్ వాల్ నిర్మించాలనే యోచనలో ఉంది. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి అటూ సుందరీకరణ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. బఫర్ జోన్‌లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేరా రెండు వైపులా రోడ్లను నిర్మించనుంది. అటు ఇటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.

Related News

Kacheguda Railway Station: గులాబీ రంగులో మెరిసిన.. కాచిగూడ రైల్వేస్టేషన్.. కారణం మీరనుకున్నది కాదు కానీ..?

Mallanna Sagar Land: రోడ్డెక్కిన మల్లన్న సాగర్ బాధితులు.. హరీష్ రావుకు వార్నింగ్

Chit Fund: చీటింగ్.. చిట్ ఫండ్స్

Bhatti Vikramarka: పవర్ కట్ సమస్యలకు క్షణాల్లో పరిష్కారం.. విద్యుత్ అంబులెన్స్‌‌లు ఇలా పనిచేస్తాయ్!

Group 1 Mains: గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతం.. అన్ని కేంద్రాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్

TGPSC Group 1 Mains: ఎగ్జామ్ హాల్ లోపలికి పంపలేదని.. గోడ దూకిన గ్రూపు 1 అభ్యర్ధి.. చివరికి ఏం అయిందంటే..

Big Stories

×