EPAPER

Republic Day 2024 : ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..”జయ జయహే తెలంగాణ”

Republic Day 2024 : ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..”జయ జయహే తెలంగాణ”

Republic Day 2024 : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations)కు యావత్ దేశమంతా సిద్ధమవుతోంది. ప్రతి ఏటా జనవరి 26న జరుపుకునే ఈ వేడుకలు మొత్తంలో.. ఢిల్లీలో జరిగే వేడుకలు ప్రత్యేకం. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఢిల్లీలోని రక్షణశాఖ రంగ్ శాల మైదానానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ప్రత్యేక పారామిలిటరీ బలగాలు, రక్షణ విభాగానికి చెందిన సాయుధ దళాలు ప్రతి సంవత్సరం ప్రదర్శనలో భాగమవుతున్న విషయం తెలిసిందే. అయితే సుమారు మూడేళ్ల తర్వాత.. అంటే 2020 తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో కనిపించబోతోంది.


దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి చొరవ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 27న ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణ సంక్షోభం గురించి చర్చించినట్లు సమాచారం. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో “ప్రజాస్వామ్య మట్టి పరమాళాలు – జనసనం ప్రజాస్వామ్య యోధులు” అనే థీమ్ తో తెలంగాణ శకటం సిద్ధమవుతోంది. ఈ శకటానికి జయజయహే తెలంగాణ అని నామకరణం చేశారు.

ప్రజాకవి అందెశ్రీ రచించిన ఈ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రాచుర్యం పొందదింది. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్, బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించిన రాంజీ గోండు, వీర వనిత చాకలి ఈతమ్మ విగ్రహాలను శకటంలో ప్రదర్శించనున్నారు. మలిదశ ఉద్యమ త్యాగాలను స్మరించుకునేలా తెలంగాణ శకటం రూపుదిద్దుకుంటోంది.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×