EPAPER
Kirrak Couples Episode 1

Gudivada: గుడివాడలో కొడాలిని ఓడించగలరా?.. రేణుకాచౌదరి ధీమా ఏంటి?

Gudivada: గుడివాడలో కొడాలిని ఓడించగలరా?.. రేణుకాచౌదరి ధీమా ఏంటి?

Gudivada: రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చెప్పలేం. అలాంటిదే లేటెస్ట్ గా ఓ పొలిటికల్ ట్విస్ట్. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ రేణుకా చౌదరి తెలుసుగా. ఖమ్మం అడ్డాగా ఢిల్లీ స్థాయికి ఎదిగిన నేత. పెద్ద నోరున్న నాయకురాలు. సామాజికవర్గ బలం, అనుచరుల బలం ఎక్కువ. బెదరులేని లీడర్. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఖమ్మం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి మాజీ ఎంపీ రేణుకాచౌదరి సడెన్ గా ఓ బాంబు పేల్చారు. ఈసారి తాను ఏపీలోని గుడివాడ నుంచి పోటీ చేసే అవకాశమూ ఉందని.. ఆ మేరకు తనకు ఆహ్వానం ఉందని.. ప్రకటించి బ్రేకింగ్ న్యూస్ గా మారారు.


తెలంగాణ లీడర్ ఏపీలో పోటీ చేయడమే ఆసక్తికరమంటే.. అందులోనూ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నానిపై బరిలో దిగడం అంటే మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరి నోళ్లకూ అదుపు తక్కువే. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గమే. రేణుకాచౌదరి అన్నట్టుగానే గుడివాడ నుంచి పోటీ చేస్తే.. ఇక దబిడి దిబిడే.

అసలెందుకు రేణుకాచౌదరి గుడివాడపై ఫోకస్ పెట్టారు? కొడాలి నానిని ఓడించాలనే పంతం ఎందుకు? అంటే దానికీ ఓ లెక్కుంది. ఏడాది క్రితం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆమెపై నోరు జారిన నేతల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఒకరు. ఆ సమయంలో రేణుకా చౌదరి భువనేశ్వరికి అండగా నిలిచారు. కొడాలి నానిపై మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రేణుకా చౌదరికి కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టి సపోర్ట్ లభించింది.


అప్పటి నుంచీ కొడాలి నాని వర్సెస్ రేణుకా చౌదరి అన్నట్టుగా ఇష్యూ నడుస్తోంది. అదలా కంటిన్యూ అవుతూ అవుతూ.. కొడాలిపై పంతం పెరుగుతూ.. తాజాగా నేరుగా గుడివాడ నుంచే పోటీ చేసే దిశగా ఆలోచన కూడా చేస్తున్నారు రేణుకా. మరి, వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిని గుడివాడలో ఓడించడం అంత ఈజీనా? కమ్మ సామాజిక వర్గాన్ని నమ్ముకునే పోటీకి సిద్ధం అవుతున్నారా? ఖమ్మం, గుడివాడ.. ఒకటికాకపోతే ఇంకోటి అనుకుంటున్నారా?

Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×