EPAPER

KCR : అహంకారమే కేసీఆర్ పాలిట శాపమా..? ఓటమికి కారణం అదేనా..?

KCR : అహంకారమే కేసీఆర్ పాలిట శాపమా..? ఓటమికి కారణం అదేనా..?
KCR latest news telugu

KCR latest news telugu(Political news in telangana):

కారు.. సారు.. సర్కారు ఇది ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలు. కానీ తెలంగాణ ప్రజలకు.. ఆ డైలాగ్ తో పాటు.. ఆ కారు.. ఆ సారు.. బోరు కొట్టేశారని ఎన్నికల తీర్పును చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ ఓటమికీ కేసీఆర్ అహంకారం ఓ కారణమైతే.. ఓవర్ కాన్ఫిడెన్స్ మరో కారణమే. తెలంగాణ ప్రజల తీర్పు ఇతర నాయకులకు ఓ గుణపాఠమనే చెప్పుకోవాలి.


తెలంగాణ ఎన్నికల ఫలితాలు చెబుతున్నదేంటి..? ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఉద్యమం జరిగిందే బానిస సంకెళ్లు తెంచే స్వేచ్ఛ కోసం.. మరి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవించారా? ఆ స్వేచ్ఛ లేకే చరిత్రలో నిలిచిపోయే తీర్పు చెప్పారా..?

అవును తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే.. ఇదే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే పదేళ్ల పాలనలో ఏనాడూ కూడా కేసీఆర్‌ ప్రజలతో మమేకమవలేదు. ఎంతసేపు ప్రగతిభవన్‌లో కూర్చోని ఓ రాజులా పాలించాడు తప్ప.. రాజ్యంలోని ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.


దాన్ని చెప్పే ప్రయత్నం చేసినవాళ్లను కూడా కేసీఆర్ దగ్గరకు రానివ్వలేదన్న ప్రచారం కూడా ఉంది. అందుకే ఇప్పుడీ దారుణ పరాజయం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అహంకారాన్ని దించిన తెలంగాణ గడ్డగా మారోమారు తన చైతన్యాన్ని నిలుపుకుంది.

అధికారం నెత్తికెక్కితే దేవుడు కూడా కాపాడలేడు. చరిత్రలో ఎంతో మంది పోయారు. ఇవి అసెంబ్లీలో కేసీఆర్‌ అన్న మాటలు.పెద్దపెద్ద నేతలనే ప్రజలు చీల్చిచెండాడారు.కేసీఆర్‌ చెప్పినట్టే జరిగింది. కానీ అది ఆయనకే జరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కళ్లు నెత్తికి ఎక్కితే కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే..! చాలా సందర్భాల్లో బీఆర్ఎస్‌ నేతలు ఈ మాట చెప్పారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. అదే ప్రజలు అదే కర్రు కాల్చి బీఆర్ఎస్‌ నేతలకు పెట్టారు.

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ ప్రయత్నాన్ని గండి కొట్టారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికల్లో సెంటిమెంట్ మాటలతో ఆకట్టుకున్న కేసీఆర్.. ఈసారి మాత్రం ఆ ప్రయత్నంలో దెబ్బతిన్నారు. దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఈ అపజయానికి మాత్రం ముమ్మాటికి కేసీఆర్ వైఖరే కారణం.

కేసీఆర్‌కు అహంకారం ఉందని ఆయనతో కలిసి పక్కకు తప్పుకున్న వాళ్లు చెబుతున్న మాట. దొర పోకడతో ఓ నియంతలాగా పాలిస్తున్నారని ఇన్నాళ్లూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. కానీ సమయం చూసి సరిగ్గా ఆ దొర పాలనకు.. చరమగీతం పాడి.. తాము బానిసలం కాదు.. చైతన్య ప్రతీకలమని నిరూపించారు.

రాష్ట్ర ఏర్పాటు ముందువరకు కూడా.. తెలంగాణ అంటే కేసీఆర్‌ .. కేసీఆర్‌ అంటే తెలంగాణ అన్న రీతిలో పెనవేసుకుపోయింది బంధం. కానీ ఆ బంధాన్ని పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు. మీ పాలన నచ్చలేదని తెగేసి చెప్పారు. ఇక చాలు దొర అంటూ సెలవు అని ముఖం మీద చెప్పేశారు. నన్ను కాదని ఎవరిని ఎన్నుకుంటారులే అన్న కేసీఆర్‌ అహంకారం పై తెలంగాణ ప్రజలు దారుణంగా దెబ్బ కొట్టారు. ఈ ఓటమిని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో గెలుపొటములు సాధారణం. కానీ.. బయట ప్రపంచానికి ముఖం చూపెట్టలేక ప్రగతి భవన్ నుంచి నేరుగా ఫామ్ హౌజ్ కు వెళ్లిపోవడాన్ని చాలా మంది ఎత్తిచూపుతున్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ దారుణ ఓటమికి కారణం ఏంటో ఒక్క వాక్యంలో కాదు.. ఒక్క పదంలోనే చెప్పమంటే.. అహంకారం అని ఎవ్వరైనా చెబుతారు.తొమ్మిదేళ్లుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబసభ్యులు అప్రతిహతంగా అధికారంలో ఉంటున్న నేపథ్యంలో తలకెక్కిన అహంకారం మాత్రమే వారి ఓటమికి దారితీసిందని అందరూ ఏకీభవిస్తారు. ఎన్ని రకాల ఇతర కారణాలు కనిపించినప్పటికీ.. అవన్నీ కూడా.. ఈ అసలు కారణం అహంకారంతో ముడిపడినవి మాత్రమే. ఈ నేపథ్యంలో.. అతిగా విర్రవీగి బీఆర్ఎస్‌ దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా.. కేసీఆర్ లోని అహంకారం మాత్రం ఇసుమంతైనా తగ్గినట్టుగా కనిపించడం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీఆర్ఎస్ ఓడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఫలితాలు ఈ స్థాయిలో వెల్లడైన తర్వాత చేసి తీరాల్సిందే. తప్పదు గనుక రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను.. ఒక ప్రత్యేక దూత ద్వారా గవర్నరుకు పంపించారు. సాధారణంగా ఓడిపోయిన ముఖ్యమంత్రి గవర్నరును స్వయంగా కలిసి రాజీనామా లేఖ సమర్పించడం సాంప్రదాయం. అయితే కొత్త ప్రభుత్వం పదవీ స్వీకార ప్రమాణం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నరు కోరడం కూడా సహజం. కానీ.. ఓడిపోయినా సరే.. తనలో అహంకారం ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకుంటున్నట్టుగా.. కేసీఆర్ రాజ్ భవన్ గడప తొక్కలేదని జనం అనుకుంటున్నారు.

అందుకే చింతచచ్చినా పులుపు చావలేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో తన మాటల గారడీతో తెలంగాణలో గెలుపొందగలిగారు. ఈసారి మాత్రం ప్రజలు అందుకు అంగీకరించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని కేసీఆర్‌ పేరు బంధాన్ని తెంచుకోగా… కేసీఆర్‌ పదవి బంధాన్ని ఇప్పుడు ప్రజలు తెంచేసారు.

కేసీఆర్ పెద్ద స్ట్రాటజిస్టు.. వ్యూహాలు రచించడంలో ఆయనను మించిన వారు లేరు. ఇవన్నీ ఎన్నికలకు ముందు వరకూ ఉన్న మాటలు. పోలింగ్ తేదీనైనా గ్రౌండ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్న సత్తా ఉందన్నది గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తల ధైర్యం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు ఎన్నికలు పెద్ద కష్టం కాదని వాళ్లు భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ నాయకత్వం లేమి కూడా తమకు కలసి వచ్చే అంశంగా కేసీఆర్ సైతం భావిస్తూ వచ్చారు.

అంతే కాకుండా తనకు ఎదురు లేదనే ఆయన భావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాను మూడో సారి బయటపడతానని వేసుకున్న అంచనాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. ఆయనకు మూడోసారి ఓటమిని తెచ్చి పెట్టాయి. గెలిస్తే కేసీఆర్ అంతా తానేనంటూ ఎంతగా క్రెడిట్‌ను సొంతం చేసుకుంటారో.. ఓటమిని కూడా ఆయన ఖాతాలో వేయాల్సిందే.

కాంగ్రెస్ గెలవడానికి అనేక కారణాలెన్నో. కేసీఆర్ పార్టీ ఓటమి పాలు కావడానికి కూడా అన్నే రీజన్స్ ఉన్నాయి. కేసీఆర్ స్వయంకృతాపరాధమే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకుండా చేసిందనే చెప్పాలి. కేసీఆర్ తన బొమ్మను చూసి ఓటేస్తారనుకున్నారు. తెలంగాణ తెచ్చిన నేతగా తనకు తిరుగులేదనుకున్నారు. తనను తప్ప వేరే పార్టీని ఇక్కడ ఆదరించే అవకాశాలు లేవనే ఆయన గట్టిగా భావించారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమని భావించారు. ఆ పార్టీ కోలుకునే పరిస్థితి ఉండదని అంచనా వేసుకున్నారు. కాంగ్రెస్ నేతల్లో అనైక్యత తనకు ప్రతి చోటా కలసి వస్తుందని ఆయన వేసుకున్న అంచనాలు పూర్తిగా పటాపంచలయ్యాయి.

ఇక్కడ మనం ఓ విషయాన్ని గమనించాలి. తెలంగాణ ప్రజలకు.. కారు పార్టీ అంటే బోరు కొట్టి కూడా ఉండవచ్చు. గత పదేళ్ల నుంచి ఎక్కడైనా.. దేనికైనా ఆ నలుగురే కనపడటం కూడా ఆ పార్టీకి నష్టం తెచ్చి పెట్టింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులు మాత్రమే హైలెట్ కావడం మిగిలిన వాళ్లు కేవలం బొమ్మలుగా మారడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. చూసే వాళ్లకు పక్కా ఫ్యామిలీ ఫంక్షన్ లా పదేళ్లను కేసీఆర్ నడిపారు. ప్రగతి భవన్ ను దాటి రాకపోవడం, ఎన్ని విపత్తులు జరిగినా ఆయన కాలు కదపకపోవడం కూడా ఓటమికి గల కారణాలుగా చూడాలి.

అందుకే సెంటిమెంట్‌ను తనంతట తానుగా దూరం చేసుకోవడమే కాకుండా.. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కేసీఆర్ ను చావుదెబ్బతీసిందని చెప్పాలి. అందుకే నేతలెవ్వరైనా గెలిచినా ఓడినా ఒకేలా ఉండాలి. లేదంటే జనాలకు చీరెత్తుకొస్తే.. రిజల్ట్ తెలంగాణలాగా ఉంటుందని దేశానికే ఓ బెస్ట్ గా ఎగ్జాంపుల్ దొరికింది.

.

.

Tags

Related News

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×