EPAPER

Traffic In Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్‌కి అసలు కారణాలు ఏంటి? చెక్ పెట్టేదెలా..

Traffic In Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్‌కి అసలు కారణాలు ఏంటి? చెక్ పెట్టేదెలా..

Reasons For Hyderabad Traffic(Hyderabad latest news): ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉంటే చాలా గొప్ప.. కనీ ఇప్పుడు కాలం మారింది. దాంతో పాటే అవసరాలు మారాయి. ఇప్పుడు ఇంటికో బైక్‌, కార్‌ మస్ట్ అనే ఫీలింగ్‌కు వచ్చేశాం.. ముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి నగరంలో మనం రోజు చూస్తూనే ఉన్నాం పరిస్థితి ఎలా ఉందో.. ఇక దీనికి వర్షం తోడయ్యిందా కథ కంచికి చేరినట్టే.. ఇలాంటి సమయంలో ఓ డేటా విడుదలైంది. ఆ డేటా చూస్తే ఇప్పుడు కాస్త భయం కలిగేలా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న వెహికల్స్‌ సంఖ్య ఎంత? కౌంట్ చేయడం స్టార్ట్ చేయకండి.. మేం చేస్తాం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 68 లక్షల 5 వేల 432.. ఇప్పుడే బండి తీసుకొని రోడ్డెక్కితే ఇంటికి చేరే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది.


పోరపాటున ఏ వీఐపీ వెళ్లడమో.. వర్షం పడటమో జరిగిందా? ఇక గంటల పాటు రోడ్లపై జాగారం చేయాల్సిందే.. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రిలీజ్ చేసిన డేటా వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం రానున్న పదేళ్లలో.. అంటే 2033-34లో వెహికల్స్‌ సంఖ్య కోటి 60 లక్షల 46 వేల 853కు చేరుతుందని అంచనా.. అంటే అటు ఇటుగా మూడింతలు.. కరెక్టుగా కాకపోయినా.. కౌంట్‌ అక్కడికే వచ్చేలా ఉంది.

మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఆలోచిస్తేనే కాస్త భయం కలుగుతుంది కదా.. 2010లో హైదరాబాద్‌లో వెహికల్స్‌ సంఖ్య 12 లక్షలుగా ఉండేది. ప్రతి ఏడాది ఓ లక్ష వాహనాలు పెరుగుతాయని అంచనా వేశారు ఆ రోజుల్లో.. కానీ రియాలిటీకి వచ్చే సరికి జరిగింది వేరు. ఏడాదికి తక్కువలో తక్కువ మూడు నుంచి నాలుగు లక్షల వెహికల్స్‌ రోడ్డెక్కాయి. ఇప్పుడు ఏడాదికి ఆరు లక్షల వెహికల్స్‌ రోడ్డెక్కుతాయని RTA అంచనా వేస్తోంది. ఇక 2034 వచ్చేసరికి ఆ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా.


ప్రస్తుతం ఉన్న వాహనాల సంఖ్యనే హైదరాబాద్ రోడ్లు తట్టుకోలేకపోతున్నాయి. నరకం స్పెల్లింగ్ రాపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ట్రాఫిక్‌ బాధ నుంచి రిలీఫ్‌ కల్పించేందుకు అనేక డైవర్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాలి. అలాగని వాహనాలను కొనకుండా అడ్డుకుందామా? అంటే అది కష్టం.. నష్టం కూడా.. ఎందుకంటే అది ప్రజల కొనుగోలు హక్కును అడ్డుకోవడమే.. కాబట్టి.. అలా అడ్డుకోవడం అస్సలు కుదరదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అవుతుంది?అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం.

Also Read: బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు..

అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఫస్ట్‌ కార్లపై ఉన్న లైఫ్‌ టైమ్ ట్యాక్సెస్‌ను పెంచాలి. అప్పుడు కొద్దిగా సేల్స్ తగ్గుతాయి. సెకండ్ RTC బస్సులను పెంచాలి.. అందులోనూ ఏసీ బస్సులను పెంచాలి. ఎప్పుడైతే పబ్లిక్ సర్వీస్‌లను పెంచుతారో.. ప్రజలు వాటిపై డిపెండ్ అవ్వడం పెరుగుతుంది. అప్పుడే సొంత వాబనాల  సంఖ్య తగ్గుతుంది. అంతోకాకుండా మెట్రో సేవలను విస్తరించాలి. నగరం నలుమూలలకు మెట్రో సేవలు అందేలా ప్లాన్‌ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా డెవలప్‌మెంట్‌ను ఒకే ప్లేస్‌లో కాకుండా.. నగరం నలుమూలలా విస్తరించాలి. అప్పుడే ఒకే ప్రాంతంపై భారం తగ్గుతుంది. ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. అంతేకాదు కొందరైతే పీక్ అవర్స్‌లో బైక్స్‌ను రోడ్డుపై బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. కానీ అలా చేస్తే విమర్శలు వచ్చే చాన్సే ఎక్కువుంది.

ఇప్పటికే ట్రాఫిక్‌ పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ముంబై, బెంగళూరు ఉదాహరణ.. మన హైదరాబాద్ కూడా అదే పరిస్థితికి చేరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న వెహికల్స్‌ సంఖ్య అలానే ఉంది. పెరిగే వెహికల్స్‌లో ఎక్కువగా బైక్స్‌ ఉండటం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఎందుకంటే సరైన కనెక్టివిటీ లేకపోవడంతో చాలా మంది బైక్స్‌ కొనడంపై ఇంట్రెస్ చూపిస్తున్నారు. కొత్తగా రోడ్డుపైకి వచ్చే వెహికల్స్‌లో బైక్‌ల పర్సంటేజే దాదాపు 70 వరకు ఉంటుంది. దీనిపై కూడా అధికారులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×