EPAPER
Kirrak Couples Episode 1

TRS: అర్వింద్, షర్మిల.. దాడులతో టీఆర్ఎస్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

TRS: అర్వింద్, షర్మిల.. దాడులతో టీఆర్ఎస్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

TRS: టీఆర్ఎస్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోందా? లేదంటే, అంతా కావాలనే చేస్తున్నారా? నేతల్లో కోపం కట్టలు తెంచుకుంటోందా? దాడులతో బెదిరించాలని చూస్తున్నారా? మరి ఎందుకు గులాబీ శ్రేణులు అదుపు తప్పుతున్నారు? వరుస దాడులతో తమ అసహనాన్ని ఎందుకు బయటపెట్టుకుంటున్నారు? మునుగోడులో గెలిచినా ఊరట లభించలేదా? ఫాంహౌజ్ కేసులో పట్టు చిక్కినా సరిపోదనుకుంటున్నారా? మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు కలవరపెడుతున్నాయా? బీజేపీ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారా? ఇలా.. టీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.


అప్పట్లో తెలంగాణ ఉద్యమం ప్రశాంతంగా సాగింది. ఎంతటి భావోద్వేగం ఉన్నా.. ఎక్కడా అదుపు తప్పలేదు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఉద్యమకారులు మాత్రం శాంతియుతంగానే పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధించారు. గడిచిన ఎనిమిదేళ్లలోనూ అంతా ప్రశాంతతే. ఎక్కడా ఎలాంటి రాజకీయ దాడులు జరిగిన దాఖలాలు లేవు. కానీ, ఇటీవల కారు పార్టీ నేతలు పెడదారి పడుతున్నట్టుంది. వరుస దాడులతో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుంది.

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై కవిత అనుచరులు సడెన్ గా దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఇంటిని ధ్వంసం చేశారు. కవిత సైతం కొడతా, చంపుతా.. అంటూ బెదిరించారు. టీఆర్ఎస్ శ్రేణులు అంతలా రెచ్చిపోవడానికి అర్విందేమీ అనరాని మాటలు అనలేదని అంటున్నారు. కవిత కాంగ్రెస్ లోకి వెళతారంటేనే ఇంతటి విధ్వంసమా? అని ఆశ్చర్యపోయారు. అంతకుముందు రెండుసార్లు ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద కూడా దాడి జరిగింది. అర్వింద్ వర్సెస్ కవిత కాబట్టి వారికేదో నిజామాబాద్ పగలు, ప్రతీకారాలు ఉన్నాయని అనుకోవచ్చు.. కానీ, షర్మిల మీద దాడులెందుకు?


తన మానాన తాను పాదయాత్ర చేసుకుంటుంటే.. ఎండా వానా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్తుంటే.. ఇన్నాళ్లూ వదిలేసినట్టే వదిలేయొచ్చుగా? సడెన్ గా ఆమె ఫ్లెక్సీలు, బస్సు తగలబెట్టడం ఎందుకు? షర్మిల పాదయాత్రపై దాడి చేసి, తిరిగి ఆమెనే అరెస్టు చేసి హైదరాబాద్ తరలించడం ఎందుకు? గులాబీ నేతల్లో ఇంతటి ఫ్రస్టేషన్ ఎందుకు? అంటున్నారు.

కేంద్రం టార్గెట్ చేస్తోంది.. ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి.. బీజేపీ దూకుడు మీదుంది.. ఇలా ముప్పేట దాడితో గులాబీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. అందుకే, అలా దాడులకు తెగబడుతున్నారని చెబుతున్నారు. ఎంపీ అర్వింత్ ఇంటిపై దాడి జరిగినప్పుడే బీజేపీ హెచ్చరించింది.. మా కార్యకర్తలు తిరగబడితే మీరు ఉంటారా? అని బెదిరించింది. బీజేపీ నేతలపై దాడి చేయడమంటే ఏదో రాజకీయ అసహనం అనుకోవచ్చు. మరి, ఇప్పటి వరకూ ఏ ఉప ఎన్నికలోనూ పోటీ చేయని.. ఒక్కరంటే ఒక్క బలమైన నేత కూడా లేని.. షర్మిలపై ఇంతటి పోలీస్ యాక్షన్ ఎందుకు? ఉనికి లేని పార్టీయేగా.. ఏమవుతుందిలే అనుకున్నారా? కానీ, తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోందనే సంగతి మరిచారా? ప్రతిపక్షాలన్నీ తమ స్టైల్ లో రాజకీయం చేసుకుపోతుంటే.. పొలిటికల్ గానే వారికి బదులివ్వాలి గానీ.. అర్వింద్ ఇంటిపై దాడి, షర్మిల పాదయాత్రపై అటాక్ లాంటి విపరీత చర్యలతో అధికార పార్టీ ఎందుకు దిగజారుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. వైఫల్యాలు భయపెడుతున్నాయా? దాడులతో నోరు మూయించాలనే ప్రయత్నమా?

Related News

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

World War III Fix: ఇజ్రాయెల్-హిజ్బుల్లా వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఫిక్స్?

Chevireddy Bhaskar Reddy: ఏమైనా కానీ నేను ఏం మాట్లాడను.. భయంలో చెవిరెడ్డి

Tourism Corporation: బోయినపల్లి బంధుప్రీతి.. టూరిజం కార్పొరేషన్ అధోగతి..!

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

Big Stories

×