EPAPER
Kirrak Couples Episode 1

Khammam: ఖమ్మంలోనే బీఆర్ఎస్ సభ అందుకేనా?.. ఎవరికి గుమ్మం? ఎవరికి గండం?

Khammam: ఖమ్మంలోనే బీఆర్ఎస్ సభ అందుకేనా?.. ఎవరికి గుమ్మం? ఎవరికి గండం?

Khammam: ఖమ్మంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ. ఢిల్లీలో పెట్టాల్సింది ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఈనెల 18న ముమూర్తం. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఖమ్మం సభకు హాజరవుతారని చెబుతున్నారు. 5 లక్షల మందితో బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు? ఏ హైదరాబాద్ శివార్లలోనో, వరంగల్లోనో, మరెక్కడైనా పెట్టొచ్చుగా? మిగతా జిల్లాలతో పోల్చితే కాస్త బలం తక్కువే ఉన్న ఖమ్మంలోనే బీఆర్ఎస్ మీటింగ్ పెడుతుండటం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి? ఖమ్మంపై అన్నిపార్టీలకీ ఎందుకంత ఫోకస్?


ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా ఉన్న జిల్లా ఏదంటే ఖమ్మం అనే చెబుతారు. అక్కడ కారు ఓవర్ లోడ్ అయింది. పార్టీ నేతల కుమ్ములాటలు లైన్ దాటుతున్నాయి. కేసీఆరేమో మంత్రి పువ్వాడ అజయ్ కు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది నచ్చక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమావేశాలతో బెదరగొడుతున్నారు. ఇదే కరెక్ట్ టైమ్ అంటూ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం రెబెల్ జెండా ఎగరేశారు. ఐదారు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆ ఇద్దరు నేతలు.. కేసీఆర్ కు సవాల్ విసురుతుండటంతో బీఆర్ఎస్ బెంబేలెత్తుతోంది. అయినా, ఖమ్మంలోనే బహిరంగ సభను పెడుతుండటం కేసీఆర్ కే చెల్లింది.

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సైతం ఖమ్మం జిల్లాపైనే గురి పెట్టారు. పాడేరు నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఆఫీసు కూడా కడుతున్నారు. పాడేరు నుంచి తాను గెలిచి చూపిస్తానంటూ ఛాలెంజ్ చేస్తున్నారు.


ఒకప్పుడు కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఖమ్మంలో ఇప్పటికీ ఆ రెండు పార్టీల బలమైన మద్దతుదారులు ఉన్నారు. కమ్యూనిస్టులు కనుక బీఆర్ఎస్ తో జతకడితే అది ఆ పార్టీకి అదనపు అడ్వాంటేజ్ గా మారొచ్చు. ఇక, ఏమాత్రం ఛాన్స్ చిక్కినా.. కాంగ్రెస్ పార్టీ సత్తా చాటొచ్చు..అంటున్నారు.

ఇక, చంద్రబాబు సైతం ఖమ్మం.. టీడీపీ గుమ్మం అంటూ ఇటీవలే భారీ సభతో బలప్రదర్శన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. కాకపోతే లీడర్లే లేరు. ఇటీవలి చంద్రబాబు సభ.. ఆ సభకు వచ్చిన జనాలను చూస్తుంటే.. బలమైన అభ్యర్థులు బరిలో దిగితే ఖమ్మంలో టీడీపీ ప్రభావం భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

తుమ్మల మళ్లీ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగినా.. ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎంపీ పొంగులేటి సైతం కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమైపోయారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగే 18వ తేదీనే.. ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాషాయ తీర్థం తీసుకుంటారని చెబుతున్నారు. రేపోమాపో తుమ్మల సైతం బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు.

ఈ విషయాలన్నీ తెలిసే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మంలో బహిరంగ సభ ప్లాన్ చేశారని తెలుస్తోంది. చంద్రబాబు, షర్మిల, తుమ్మల, పొంగులేటి.. ఇలా అంతా ఖమ్మంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతుంటే.. వారందరికీ దిమ్మతిరిగేలా భారీ బహిరంగ సభ నిర్వహించి.. ఖమ్మంలో బీఆర్ఎస్ దే హవా అనే మెసేజ్ బలంగా చాటేందుకే ఆ వేదికను ఎంచుకున్నారని చెబుతున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉండటంతో.. అక్కడ సభ పెడితే.. రెండు రాష్ట్రాల్లోనూ ఈ రీసౌండ్ వినిపిస్తుందనేది మరో ఎత్తుగడ అంటున్నారు.

అసలే అధికార పార్టీ. సభ పెట్టడం.. భారీగా జనసమీకరణ చేయడం.. మీటింగ్ సక్సెస్ చేయడం.. బీఆర్ఎస్ కు పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ, కేవలం భారీ సభ పెట్టినంత మాత్రాన.. ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని అనుకునే పరిస్థితి ఉండదు. గత ఎన్నికల్లో పువ్వాడ మినహా టీఆర్ఎస్ అభ్యర్థులంతా ఓడిపోయారు. ఖమ్మంలో కారు గుర్తుపై నేరుగా గెలిచింది ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే. ఆ ఓటమికి సైతం తుమ్మల, పొంగులేటిలే కారణమని భావిస్తున్నారు గులాబీ బాస్. ఇప్పుడు వాళ్లిద్దరూ బీజేపీలో చేరితే.. ఖమ్మం కంచుకోటలు బద్దలు కావడం ఖాయం. జిల్లాపై షర్మిల, చంద్రబాబుల ప్రభావాన్నీ తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. ఎలా చూసినా.. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం.. కేసీఆర్ కు గండమేనని అంటున్నారు.

Tags

Related News

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

Big Stories

×