EPAPER
Kirrak Couples Episode 1

Kamareddy: కామారెడ్డి రైతులు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు?.. కేసీఆర్ పై ప్రజాగ్రహమా?

Kamareddy: కామారెడ్డి రైతులు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు?.. కేసీఆర్ పై ప్రజాగ్రహమా?

Kamareddy: మాది రైతు ప్రభుత్వం. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇస్తున్నాం. మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినా మేం పెట్టలేదు. ఏడాదికి రెండుసార్లు రైతు బంధు జమ చేస్తున్నాం. రైతు బీమా కూడా కల్పిస్తున్నాం. ఇవీ.. సీఎం కేసీఆర్ తరుచూ చేసే వ్యాఖ్యలు. రైతు కేంద్రంగానే గులాబీ బాస్ రాజకీయం చేసేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆ ఆందోళనల్లో చనిపోయిన రైతులకు నగదు పరిహారం అందించారు. ఇలాంటి చర్యలు.. అలాంటి మాటలతో.. రైతులంతా కేసీఆర్ వెంటే ఉన్నారనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక, బీఆర్ఎస్ ట్యాగ్ లైన్ సైతం.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ రైతు కేంద్రంగానే కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇంతా చేస్తుంటే.. రైతులంతా కేసీఆర్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరి కామారెడ్డిలో జరుగుతున్నది ఏంటి? రైతులంతా ప్రభుత్వంపై ఎందుకు తిరగబడుతున్నారు? ఆ రైతు ఆగ్రహం కేవలం కామారెడ్డికే పరిమితమా? తెలంగాణ వ్యాప్తంగా రైతులు కేసీఆర్ సర్కార్ పై అదే స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


కామారెడ్డి చుట్టూ ఇండస్ట్రియల్ జోన్. అనేక మంది రైతుల పొలాలు జోన్ లోకి వస్తున్నాయి. పంట పండే భూముల్లో పరిశ్రమలు ఏంటనేది రైతుల నిలదీత. అయితే, అది కేవలం ముసాయిదా మాత్రమేనని.. అభ్యంతరాలుంటే మార్చేస్తామని మంత్రి కేటీఆర్ తో సహా అధికారులంతా చెబుతున్నారు. రైతులు మాత్రం వినట్లే. వెంటనే జోన్ ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ ను ముట్టడించి.. పోలీసులతో తోపులాటకు దిగి.. కామారెడ్డి బంద్ కు పిలుపు ఇచ్చి.. ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు రైతన్నలు.

రైతుల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ ఆరోపణ. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయనే విమర్శ. అయితే, ఎవరో రెచ్చగొడితే రైతులు మరీ అంతలా రెచ్చిపోతారా? వాళ్ల కడుపు మండందే.. వేలాదిగా అలా దండు కడతారా? పోలీసులకు బెదరకుండా.. బారికేడ్లు, ముళ్లకంచెలకు ఆగకుండా.. తమ పొలాల కోసం గట్టిగా పోరాడుతున్న రైతులకు పార్టీ మరకలు అంటించగలరా? అనేది విపక్షం మాట.


కేసీఆర్ పట్ల రైతులు నిజంగా సంతృప్తిగానే ఉండిఉంటే.. కామారెడ్డి రైతు ఉద్యమం ఇంత ఉవ్వెత్తున జరిగేదా? అనే అనుమానం. రైతు బంధు, కరెంటు, నీళ్లు, బీమా ఇచ్చేస్తే.. రైతులంతా అన్నివిషయాల్లో కేసీఆర్ కు జై కొట్టేస్తారా? రైతులు కూడా ప్రజలేగా.. వారు కూడా సుపరిపాలన, రోడ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితబంధు, అభివృద్ధి కోరుకుంటారుగా? ధరణి పోర్టల్ తో అక్రమాలను అనుమతించలేరుగా? అందుకే, ప్రస్తుత కామారెడ్డి రైతుల ఆందోళన కేవలం ఇండస్ట్రియల్ జోన్ పై ఉన్న వ్యతిరేకతగా మాత్రమే చూడలేమని.. కేసీఆర్ పాలనపై ఎప్పటినుంచో గూడుకట్టుకున్న ఆగ్రహం ఇప్పుడిలా బద్దలైందని అంటున్నారు. కామారెడ్డి ఎపిసోడ్ జస్ట్ ఒక శాంపిల్ మాత్రమేనని.. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవకాశం వచ్చినా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారనేది విశ్లేషకుల వాదన.

Related News

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

Big Stories

×