EPAPER

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ

హైదరాబాద్, స్వేచ్ఛ: బేగంపేట్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ లీగల్ సెల్ సన్మానించింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ టీం సభ్యులు హాజరయ్యారు. సన్మానం అనంతరం మాట్లాడిన సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం న్యాయవాదులు అధికారం ఎటు ఉంటే అటు వెళ్తున్నారని మండిపడ్డారు. లీగల్ హెడ్ కార్యక్రమాలు తరుచూ మనం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


Also Read: థాంక్యూ.. సీఎం సార్: బీసీ సంఘాల నేతలు

ఇక, కవిత అరెస్ట్‌పై స్పందించిన ఆయన, కేజ్రీవాల్ కేసు, కవిత కేసు వేరని అన్నారు. విచారణ పూర్తి చేసాకే మహిళగా కవితను అరెస్ట్ చేశారని, న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. టీపీసీసీ లీగల్ సెల్ క్షేత్ర స్థాయిలో విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు మన లీగల్ సెల్ తరఫు నుంచి భరోసా కల్పించాలని, హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జలాల్లో కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ, న్యాయవాదుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. టీపీసీసీ లీగల్ సెల్‌కి టీపీసీసీ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్, ఇండ్ల స్థలాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హైకోర్టు కొత్త భవనాన్ని సకాలంలో పూర్తి చేసేలా కృషి చేస్తామని తెలిపారు.


Related News

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

CM Revanth: అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×