EPAPER

Raj pakala: పాకాలపై ప్రశ్నల వర్షం.. సుమారు 4 గంటలుగా సాగుతోన్న విచారణ, డ్రగ్స్ ఎలా వచ్చాయ్?

Raj pakala: పాకాలపై ప్రశ్నల వర్షం.. సుమారు 4 గంటలుగా సాగుతోన్న విచారణ, డ్రగ్స్ ఎలా వచ్చాయ్?

Raj pakala: జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీసుల ముందుకొచ్చాడు. దీంతో ఆయన్ని పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. నార్సింగి ఏసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతోంది.


శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం. అర్థరాత్రి దాటిన తర్వాత పెద్ద శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. ఆ తర్వాత విజయ్ మద్దూరికి జరిపిన డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు వారికి డ్రగ్స్ ఎలా అందాయ్? ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పోలీసులు కూడా ఇదే విషయాలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

సోదాల సమయంలో 20 మందికి పైగా పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే దాదాపు 40 మందితో ఈ పార్టీ నిర్వహించినట్టు అంతర్గత సమాచారం. పురుషులకు టెస్ట్ చేయగా రాజ్ పాకాల ఫ్రెండ్ విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.


ఈ వ్యవహారం తర్వాత రాజ్ పాకాల అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారాయన. ఈ క్రమంలో బుధవారం పోలీసుల ముందుకొచ్చాడు రాజ్ పాకాల. పోలీసుల విచారణలో పార్టీ, డ్రగ్స్ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Maoists Warning To BRS Leaders : ఆ బీఆర్ఎస్ నేతలను వదలం.. మావోయిస్టుల హెచ్చరిక

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. సీఎం రేవంత్ ఫ్యామిలీ

CM Revanth Reddy: చదువుల తల్లికి చేయూత.. గిరిజన యువతికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం

Ponnam Prabhakar on Diwali: జనావాస సముదాయల మధ్య బాణసంచా విక్రయాలపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Congress Leaders On KTR: జన్వాడ ఫామ్ హౌస్.. కాంగ్రెస్ నేతల డ్రగ్స్ టెస్ట్, సైలెంటయిన బీఆర్ఎస్

BRS Women Leaders: కేటీఆర్ నోరు మెదపరేం.. ఆ మహిళలకు న్యాయం జరిగేనా?

×