EPAPER

TS Rains: అకాల వర్షం.. ఎంత నష్టం? ఎంత కష్టం?

TS Rains: అకాల వర్షం.. ఎంత నష్టం? ఎంత కష్టం?
farmers rain

TS Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాలు అన్నదాతల్ని పుట్టిముంచుతున్నాయి. వడగండ్లతో వరి పంటంతా నేలపాలవుతుండగా… ఈదురుగాలులకు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గాలి దుమారానికి మామిడి పంట నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరడంతో వడ్లన్నీ తడిసిపోయాయి.


నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసి… వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదనీటికి ధాన్యం తడిసిపోగా… నువ్వులు, సజ్జలు, వరి, పొద్దుతిరుగుడు పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో విక్రయం కోసం వచ్చిన పసుపు తడిసి ముద్దయింది. తడిసిన పంటను లెక్కలోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో ఏడు మండలాల్లో 4వేల471 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. 20 కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోయింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలు రైతుల్ని నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లాయి. ఈదురుగాలులు , భారీ వర్షానికి వరి చేనులో గింజలన్నీ నేలపాలయ్యాయి. గాలి దుమారానికి మామిడి పంట నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు.


మెదక్ జిల్లా రామాయంపేట, నార్సింగి, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో… ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. రామాయంపేట శివారులో చెట్టు కొమ్మ విరిగిపడి బైక్ పై వెళ్తున్న మహిళ మృతి చెందింది. మండలాల్లో ఎండబెట్టిన ధాన్యం… నీటిపాలైంది. కొంత ధాన్యం తడిసి ముద్దవ్వగా……మరికొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు ఈదురుగాలులతో వర్షం… మరోవైపు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం అతలాకుతలం చేసింది. భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, కాటారం… జనగామ జిల్లాలోని బచ్చన్నపేట, రఘునాథపల్లి… హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, పరకాల.. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, ఖానాపూర్ మండలాల్లో…. వర్షంతో పంటలు నీటమునిగాయి. ఈదురుగాలులతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతోపాటు వడగళ్లు పడడంతో వడ్లు, మామిడికాయలు రాలిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోగా, స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరిపంట కోసి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మరో రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉంటే ధాన్యం రాశులు మొలకలు వచ్చే పరిస్థితులున్నాయి.

మహబూబాబాద్ జిల్లా మోకాళ్లపల్లిలో వర్షానికి పెంకుటిల్లు కుప్పకూలింది. కుటుంబసభ్యులకు ప్రాణాపాయం తప్పింది. సుమారు ఐదు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లో ఉన్న బియ్యం, టీవీ, ఇతర సామాన్లు ధ్వంసమయ్యాయి. రాత్రంతా కుటుంబసభ్యులు బడిలో తలదాచుకున్నారు.

మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పడంతో… రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పంట తడిసి తీవ్రంగా నష్టపోయామని… ఇది ఇలాగే కొనసాగితే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణశాఖ మాత్రం మొత్తం 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×