EPAPER

Rain alert: ఆకాశం ముసురేసింది.. ఊరంతా ముసిగేసింది.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Rain alert: ఆకాశం ముసురేసింది.. ఊరంతా ముసిగేసింది.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, శుక్రవారం రాత్రి అది ఏపీ, ఒడిషా తీరాల వైపు కదులుతోంది.


ఆదివారం ఉదయం నుంచి అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు గంటలకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఊదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని పేర్కొంది. శనివారం నుంచి నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.


ALSO READ:  ఎస్డీఎఫ్ నిధులు, పనులు నిలిపివేయడం దుర్మార్గం: హరీశ్ రావు

గతరాత్రి నుంచి హైదరాబాద్‌తోపాటు మిగతా ప్రాంతాల్లో వర్షాలుపడ్డాయి. వాతావరణ శాఖ వార్నింగ్ తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 5 సెంటిమీటర్లు, వరంగల్ జిల్లా-4, భదాద్రి కొత్తగూడెంలో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఉమ్మడి కృష్ణా జిల్లా, విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. విజయవాడ, విశాఖలోని ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. ఇక కృష్ణారావుపాలెం-కేశ్యాతండా మధ్య వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోని వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

 

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×