EPAPER

Ponguleti: రాహుల్ టీమ్‌తో పొంగులేటి భేటీ!.. వామ్మో, అన్ని షరతులా?

Ponguleti: రాహుల్ టీమ్‌తో పొంగులేటి భేటీ!.. వామ్మో, అన్ని షరతులా?
ponguleti rahul gandhi

Ponguleti: గాలి వీచినప్పుడే తూర్పారబట్టాలి. డిమాండ్ ఉన్నప్పుడే రేటు పెంచాలి. ఇలాంటి కాన్సెప్ట్‌లనే రాజకీయాల్లోనూ వాడుతున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు ఆయన. ఆర్థిక, అంగ బలం మెండు. అయినా, కేసీఆర్ తనను పట్టించుకోకపోవడంతో బాగా హర్ట్ అయ్యారు. బీఆర్ఎస్‌లో రెబెల్‌గా మారారు. పార్టీ వేటు వేసింది. ఇప్పుడిక.. వేరే పార్టీల వేటలో పడ్డారు పొంగులేటి.


ఆయనకున్న క్వాలిటీస్ చూసి.. అన్నిపార్టీలూ పొంగులేటి వెంట పడుతున్నాయి. షర్మిలతో భేటీ అయ్యారు. తమ పార్టీలో చేరుతారని ఆమె ప్రకటించారు. కానీ, ఈయన తూచ్ అన్నారు. కాషాయ కండువా కప్పుకుంటారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెట్టిన రోజునే.. బీజేపీ తీర్థం తీసుకుంటారని అన్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చినట్టుంది. కొన్నిరోజులుగా పొంగులేటి హస్తం గూటికి చేరుతారంటూ చర్చ జరుగుతోంది. లేటెస్ట్‌గా మరింత ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది.

ఖమ్మం రాజకీయాల్లో కాకరేపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ఏకంగా రాహుల్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆరు గంటల పాటు చర్చలు జరిపింది. ఈ భేటీలో ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు.. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.


రాహుల్‌ టీమ్‌తో జరిపిన భేటీతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పలు డిమాండ్లు పెట్టారు. తనతో పాటు 10 మందికి టికెట్లు ఇవ్వాలని కోరారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం తప్ప జిల్లాలోని అన్ని స్థానాలను తన అనుచరులకు ఇవ్వాలని కండీషన్ పెట్టారట. దీంతో పాటు హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ టికెట్‌ను కూడా తన మనిషికి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట. పొంగులేటి డిమాండ్లను విన్న రాహుల్‌ టీమ్‌.. పార్టీలో చేరితే తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌టీమ్‌కు చివరగా పొంగులేటి ఏం చెప్పారన్నది సస్పెన్స్‌గా ఉంది.

అయితే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి షరతులపై సీఎల్పీ నేత భట్టి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. పొంగులేటి కోరినన్ని సీట్లు ఇస్తే.. రేణుకాచౌదరి సీటు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. ముందు పార్టీలో చేరమనండి.. టికెట్ల విషయం తర్వాత చూద్దామని ఇరువురు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు పొంగులేటితో బీజేపీ నేతలు కూడా చర్చలు జరుపుతున్నారు. ఏకకాలంలో రెండు పార్టీలతో డీల్‌ నడుపుతున్న పొంగులేటి.. చివరకు ఏ పార్టీలో చేరుతారన్నది సస్పెన్స్‌గా మారింది.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×