EPAPER
Kirrak Couples Episode 1

KCR: భద్రాద్రికి సీఎం కేసీఆర్ రావాల్సిందే.. భక్తుల డిమాండ్.. ఈసారైనా సారొస్తారా?

KCR: భద్రాద్రికి సీఎం కేసీఆర్ రావాల్సిందే.. భక్తుల డిమాండ్.. ఈసారైనా సారొస్తారా?

KCR: “ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ అయోధ్య భద్రాచలం అభివృద్ధి చెందలేదు. శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల్లేవు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుకుందాం. రూ.100 కోట్లు కేటాయిస్తా. మంచిగ డెవలప్ చేసుకుందాం” – 2016లో సీఎం కేసీఆర్


ఇది స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ. సీన్ కట్ చేస్తే 2023 దాకా ఒక్క రూపాయి కూడా రాలేదు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. ఆ వంద కోట్ల నిధుల కోసం రాముల వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. కమనీయం, రమణీయంగా సాగే ఆ సీతారాముల కల్యాణానికి భద్రాచలానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. భద్రాద్రి అంటేనే దక్షిణ అయోధ్య. అంతటి పేరున్న ఈ ఆలయం అభివృద్ధిలో మాత్రం ముందడుగు పడడం లేదు. సీఎం కేసీఆర్ ఎన్నో ఆలయాలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే వాటిలో కొన్నిటికే మోక్షం కలిగింది.

ఎప్పుడో 2016 తర్వాత కేసీఆర్ మళ్లీ భద్రాచలం ఆలయం వైపు చూడలేకపోయారు. అప్పట్లో ఇస్తానన్న 100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. టెంపుల్‌టౌన్‌గా భద్రాద్రిని తీర్చిదిద్దుతానన్న హామీ కూడా నెరవేరలేదు. నిజానికి సీఎం ఇలా హామీ ఇవ్వగానే అలా ఒక అడుగు ముందుకు పడినట్లుగా కనిపించింది. కానీ పరిస్థితి మారలేదు. అప్పట్లో చిన జీయర్ స్వామి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి.. సుందర భద్రాద్రి మాస్టర్ ప్లాన్ తయారు చేసి సీఎంకు అందజేశారు. కారణమేంటో గానీ… ఆ ప్రతిపాదన మూలకు పడింది. తెలంగాణ రాక ముందు భద్రాద్రి ఆలయం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది.


భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున పెట్టే పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలకు రాష్ట్ర సర్కారు డబ్బులు కూడా ఇవ్వడం లేని పరిస్థితి ఉంది. సీతారాముల కల్యాణానికి స్వయంగా పాలకులే పట్టుబట్టలు, తలంబ్రాలు తీసుకెళ్లాలని తానీషా కాలం నాటి శాసనంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలు అందరూ ఈ సంప్రదాయాన్ని పాటించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్​ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఒకసారి మాత్రమే సీఎం హోదాలో కేసీఆర్ సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు తెచ్చారు. 2016లో కేసీఆర్ మనుమడు హిమాన్షు పట్టువస్త్రాలు సమర్పించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత కేసీఆర్ ఆలయం వైపు వెళ్లలేదు.

గతేడాది భద్రాచలం వరదలు ముంచెత్తినప్పుడు వెళ్లిన కేసీఆర్… టౌన్ మునగకుండా ఉండేందుకు గోదావరి వెంట కట్ట నిర్మాణం ఇతర అవసరాలకు వెయ్యి కోట్లు ఇస్తానన్నారు. అదే సమయంలో ఆలయ అభివృద్ధి విషయం ప్రస్తావనకు వస్తే మరోసారి వస్తానని చెప్పి అప్పట్లో దాటవేశారు కేసీఆర్. దీనిపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. శ్రీరాముడికి తలంబ్రాలు ఇచ్చేందుకు కేసీఆర్ రావడం లేదని, రాముడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చి గాలికొదిలేశాడని రేవంత్ రెడ్డి ఇటీవలే విమర్శించారు. శ్రీరాముడికి మాట ఇచ్చి మోసం చేస్తే బాగుపడుతారా.. అని ఫైర్ అయ్యారు.

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 50 కోట్లు రిలీజ్ చేసింది. కేంద్ర టూరిజం శాఖ ప్రసాద్ స్కీంలో భాగంగా కొన్ని రకాల పనులు చేపట్టేందుకు ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు. అయితే వీటితో కొన్ని పనులే జరుగుతున్నాయి. నిజానికి 2017లో రామాయణం సర్క్యూట్​ స్వదేశీ దర్శన్ పేరుతో కేంద్రం 30 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వకపోవడంతో అవి కూడా అప్పట్లో వెనక్కి పోయాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం నిధులతో భద్రాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్ణశాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పిలిగ్రిమ్​ అమినిటీ సెంటర్, టెంపుల్​ఏరియాలో సోలార్ లైటింగ్, క్యూలైన్లు ఆధునీకరణ, రామకోటి స్తూపం వద్ద ఫ్లోరింగ్, జంక్షన్​లో సోలార్​ లైటింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, బయోటాయిలెట్లు, ఇలాంటి పనులు కేంద్రమే చేస్తోంది. మొత్తం 92.4 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా తొలిదశలో 50 కోట్లు మంజూరయ్యాయి. సీతారాముల కల్యాణానికి సీఎం కేసీఆర్ రావాల్సిందే అన్న డిమాండ్ ను విపక్ష నేతలు వినిపిస్తున్నారు.

భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడు అంటూ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ఆ దేవుడికి ఇచ్చిన హామీలు, నిధులు ఏవీ లేకుండా పోయాయంటున్నారు విపక్ష నేతలు. కనీసం రాముల వారి కల్యాణానికైనా రాకపోతారా అని ఎదురుచూస్తున్నారు.

Related News

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Big Stories

×