EPAPER

Priyanka Gandhi Gadwal | పదేళ్లైనా తెలంగాణ ప్రజల కలలు.. కలలుగానే మిగిలిపోయాయి : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Gadwal | తెలంగాణ రాష్ట్రం సాధన కోసం త్యాగాలు చేసిన ఎంతో మంది కన్న కలలు.. కలలుగానే మిగిలిపోయాయని వారందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గద్వాల్‌లో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు.

Priyanka Gandhi Gadwal | పదేళ్లైనా తెలంగాణ ప్రజల కలలు.. కలలుగానే మిగిలిపోయాయి : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Gadwal | తెలంగాణ రాష్ట్రం సాధన కోసం త్యాగాలు చేసిన ఎంతో మంది కన్న కలలు.. కలలుగానే మిగిలిపోయాయని వారందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గద్వాల్‌లో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు.


సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. “ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతో మంది తమ ప్రాణాలని త్యాగాం చేశారు. తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు బాగాపడుతాయని.. రైతులకు మేలు జరుగుతుందని.. యువతకు ఉద్యోగాలొస్తాయని.. తెలంగాణ సంక్షేమం జరుగుతుందని అందరూ కలలు కన్నారు. కానీ పదేళ్ల నిరీక్షణ తరువాత కూడా తెలంగాణలో అభివృద్ధి జరగకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారిపోయింది.

తెలంగాణ ఏర్పడిన ప్రారంభంలో కేసీఆర్ వస్తే.. అభివృద్ధి జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజలకు అర్ధమైపోయింది. తెలంగాణలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోంది. ప్రతి ప్రజెక్టులో అవినీతి జరుగుతోంది. ప్రతి పథకంలో బిఆర్ఎస్ నాయకులు కమీషన్ తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు సమస్యలను పరిష్కరించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుకు రాలేదు. నేను దేశంలో అన్ని ప్రదేశాల్లో తిరుగుతాను.. కానీ తెలంగాణలా పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలు కేసీఆర్ సర్కార్‌తో విసిగి పోయారు.


తెలంగాణ యువత ఎక్కువ శాతం నిరుద్యోగులే ఉన్నారు. పేదవాళ్లు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదవిస్తున్నారు. కానీ వారి పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ప్రజలను అన్ని విధాల బలపరిచే కర్తవ్యం ప్రభుత్వానిది. బీఆర్ఎస్ నాయకుల వద్ద ఉన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయ్? ప్రజల నుంచి దోచుకున్న ధనం నుంచి కూడగట్టుకున్న ఆస్తులవి. వీరంతా సంక్షమే పథకాల పేరుతో, కమీషన్ల పేరుతో, రైతుల రుణా మాఫీ పేరుతో దోచుకున్న ధనంతో బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు కూడగట్టుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ కుటుంబం కోసం.. బడా వ్యాపారుల కోసం మాత్రమే పనిచేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్నీ ఒక్కటే. తెలంగాణలో కేసీఆర్ దోచుకుంటే.. దేశమంగా ప్రధాని మోదీ దోచుకుంటున్నారు. అంబానీ, అదానీలు దేశాన్ని దోచుకునేందుకు మోదీ, కేసీఆర్ సహాయ పడుతున్నారు. అదానీ ఒక్కరోజులో 1600 కోట్లు సంపాదిస్తుంటే.. ఒక పేదువాడు సగటను రోజుకు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడు.

రైతులు ఎన్నో కష్టాలుపడి పంటలు పండిస్తున్నారు. వారు నష్టపోయి రుణాలు కట్టలేని స్థితిలో ఉంటే.. వారిని హింసిస్తున్నారు. కానీ అంబానీ, అదానీ కంపెనీలకు వేల కోట్లలో రుణాలు మాఫీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కష్టాల గురించి ఆలోచిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. కావాలంటే కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలలో చూడండి. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ధరలను నియంత్రిస్తున్నాము. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయి. మరి తెలంగాణలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి.

బిఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలన సాగిస్తోంది. కాంగ్రెస్ వస్తే ప్రజల మధ్య నుంచి పాలన సాగుతుంది. కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. బీఆర్ఎస్ ధరణి పోర్టల్ పెట్టి పేద ప్రజల భూములు ఆక్రమిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తే పేదలకు భూములిస్తాం. ఇళ్లు లేని వారికి రూ.5 లక్షలు ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతుకి ఎకరాకు ప్రతి సంవత్సరం రూ.15000 ఇస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తాం. 200 యూనిట్లు ఉచితం కరెంటు ఇస్తాం. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి.. తెలంగాణలో అభివృ‌ద్ధి సాధించి చూపిస్తాం,” అని అన్నారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×