Ponnam Prabhakar on Diwali: జనావాస సముదాయాల మధ్య బాణసంచా విక్రయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధులు, నివాసాల మధ్య టపాసుల దుకాణాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. దీపావళి ఒక పెద్ద వేడుక అని.. ఈ పండుగ సందర్బంగా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించడానికి టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం మొత్తం, జంట నగరాల్లో బాణసంచా దుకాణాలు చిన్న చిన్న గల్లీల్లో ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో అబిడ్స్‌తో పాటు, యుకత్ పురలోని చంద్రా నగర్‌లో టపాసుల దుకాణాలు వల్ల రెండు అగ్ని ప్రామాదాలు జరిగాయి.. అదృష్టవశాత్తు పెద్దగా ప్రమాదం జరగలేదన్నారు. బాణసంచా దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా.. ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా అధికారులకు సూచించారు.
Also Read: జన్వాడ ఫామ్ హౌస్.. కాంగ్రెస్ నేతల డ్రగ్స్ టెస్ట్, సైలెంటయిన బీఆర్ఎస్
వెంటనే ఎక్కడైనా చిన్న చిన్న గల్లీల్లో జననివాస ప్రాంతాల్లో , వ్యాపార ప్రదేశాల్లో ఎలాంటి టపాసుల దుకాణాలు నిర్వహించే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని ఖాళీ ప్రదేశాలు, క్రీడా మైదానాలు, పాఠశాల వంటి ప్రాంతాల్లో దుకాణాలు పెట్టుకోవాలని సూచించారు. ఎక్కడైనా నివాస ప్రాంతాల మధ్య టపాసుల దుకాణాలు ఉంటే సంబంధిత ఏరియా అధికారి బాధ్యత వహించాలన్నారు. ప్రమాదాలు నివారించడానికి అందరి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా జనావాసాలు నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
దీపావళి పండగ సందర్భంగా టపాసులు పేల్చే విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని ప్రజలను కోరుతున్నా
జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. pic.twitter.com/6J58oLZ6XG— Ponnam Prabhakar (@Ponnam_INC) October 30, 2024