EPAPER

Khammam: బస్సు-బుస్సు.. ఆర్టీసీ కేసీఆర్ తాతదా? పొంగులేటి ఫైర్.. రేవంత్ రయ్..

Khammam: బస్సు-బుస్సు.. ఆర్టీసీ కేసీఆర్ తాతదా? పొంగులేటి ఫైర్.. రేవంత్ రయ్..
khammam congress sabha

Khammam: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ గర్జనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మందితో సభ నిర్వహణకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఖమ్మంలో నిర్వహించబోయే రాహుల్ గాంధీ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులొచ్చినా సభ సక్సెస్ అవుతుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.


ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం చేరారు. ఖమ్మం డీసీసీ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ గర్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి సైతం ఫైర్ అయ్యారు. బస్సులు, వాహనాలను అడ్డుకున్నా.. కాలినడకనైనా.. తొక్కుకుంటూ జనగర్జన సభకు రావాలంటూ రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదని.. ఈ సభతో బీఆర్ఎస్ పార్టీకి సమాధి కడతామని అన్నారు.

సుమారు వందెకరాల సువిశాల ప్రాంగణంలో పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ఖమ్మం బాట పడుతున్నారు.


రాహుల్ సభను విజయవంతం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని మాజీ మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రైవేట్ వాహనాలు సభకు రాకుండా జిల్లా నలుమూలలా చెక్ పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ముందుగా బస్సులను ఇస్తామన్న ఆర్టీసీ యాజమాన్యం.. అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వెనక్కి తగ్గిందని పొంగులేటి ఆరోపించారు. ఆర్టీసీ ఏమైనా కేసీఆర్ తాత జాగీరా అని మండిపడ్డారు. తమ సొంత, వ్యక్తిగత వాహనాల్లో తెలంగాణ గర్జనకు తరలిరావాలని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ప్రజలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. బహిరంగ సభకు మంచినీళ్ల సరఫరానూ కట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

మరోవైపు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులు రోడ్డెక్కారు. సభ కోసం వెళ్లే తమకు బస్సులు ఇవ్వాలంటూ డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. సత్తుపల్లి డిపో ఎదుట పిడమర్తి రవి, మణుగూరు డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాహుల్ సభకు ప్రజలను తరలించకుండా.. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్రలు పన్నుతున్నారని నేతలు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభను విజయవంతం చేసి తీరుతామని తేల్చిచెప్పారు కాంగ్రెస్ వాదులు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Big Stories

×