Big Stories

Kavitha: కవిత అరెస్ట్ అప్పుడేనా?.. బీజేపీ వ్యూహం అదేనా?

KAVITHA ed

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మనీశ్ సిసోడియా అరెస్టై జైల్లో మగ్గుతున్నారు. అదే స్కాంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో.. లేటెస్ట్‌గా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌ అయ్యారు. మరి, ఈసారి ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? శరత్ ఇచ్చే స్టేట్‌మెంట్ ఎవరికి ఉచ్చు బిగిస్తుంది? అంటే కవితనే అంటున్నారు. సౌత్ గ్రూపులోని నలుగురిలో శరత్‌చంద్రారెడ్డి ఒకరు. ఆయన ఏం చెప్పినా అది సౌత్ గ్రూప్‌ను లీడ్ చేసిన కవిత చుట్టూనే తిరుగుతుంది. ఆప్ నేతలతో డీల్.. 100 కోట్ల ముడుపులు.. కవిత పాత్ర.. హైదరాబాద్, ఢిల్లీ హోటల్స్‌లో జరిగిన టాక్స్.. ఇలా సంచలన విషయాలకు వాంగ్మూలం దొరకొచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం. తెలంగాణలో ప్రకంపణలు రేపుతున్న కేసు. ఆ కేసులో పలువురిని నిందితులుగా చేర్చాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. కీలక ఆధారాలు సైతం సేకరించాయి. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నుంచి మాగుంట రాఘవ వరకు.. అనేక మంది అరెస్ట్ అయ్యారు. నెలల తరబడి జైల్లో మగ్గుతున్నారు. ఆప్ సర్కార్, సౌత్ గ్రూప్ చుట్టూనే తిరుగుతోంది కేస్ అంతా. సౌత్ గ్రూప్‌ను లీడ్ చేసింది కవితనే అంటోది ఈడీ. మరి, ఇంతటి కీ రోల్ ప్లే చేసిన కవిత మాత్రం ప్రస్తుతానికి సేఫ్. ఎందుకు?

- Advertisement -

కవితకు బినామీగా ఉన్న పిళ్లైను, అడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేశారు కానీ.. ఆమెకు సంకెళ్లు వేసే సాహసం చేయలేకపోతున్నారా? వరుస ఛార్జిషీట్లలో కవిత పేరు ప్రస్తావిస్తున్నారు కానీ.. కస్టడీకి తీసుకునేందుకు కావాలనే ఆలస్యం చేస్తున్నారా? ఇప్పటికే మూడుసార్లు సుదీర్ఘంగా విచారించి స్కాంలో కవిత పాత్రను కన్ఫామ్ చేసుకున్నాక కూడా.. వదిలేయడానికి ఓ లెక్కుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సరైన సమయంలో సరైన నిర్ణయం. మోస్ట్ పాపులర్ స్ట్రాటజీ. కేంద్రంలోని బీజేపీ.. కవిత విషయంలో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. సిసోడియాను అరెస్ట్ చేస్తే ఏమైంది? ఆప్ నేతలు రెండు రోజులు హడావుడి చేశారు.. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే కూడా.. ఓ వారం బీఆర్ఎస్ హల్‌చల్ చేస్తుంది. ఆ తర్వాత జనం ఆ టాపిక్‌ను వదిలేసి.. వేరే విషయానికి షిఫ్ట్ అవుతారు. కానీ, రాజకీయంగా లబ్ది జరగాలంటే.. కవితను అరెస్ట్ చేయాల్సిన టైమ్ వేరే ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు.

కరెక్టుగా ఎన్నికల నగారా మోగే సమయానికి కవితను అరెస్ట్ చేస్తారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కవిత అరెస్టును రాజకీయ లబ్దికి వాడుకోవాలనేది బీజేపీ ఐడియాగా కనిపిస్తోంది. అదిగో చూశారా.. కవిత అరెస్ట్ అయ్యారు.. తెలంగాణ పరువు తీశారు.. ఓ మహిళ లిక్కర్ దందా చేయడం షేమ్ షేమ్ అంటూ.. కమలనాథులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, కావాలనే వ్యూహాత్మకంగా కవిత అరెస్ట్‌ను ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చింది కూడా.. కవితకు ఉచ్చు బిగించేందుకే. సిసిడియా మాదిరే.. బెయిల్ రాకుండా పకడ్బందీగా కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయబోతున్నారని టాక్. అటు, కవిత మాత్రం తెలంగాణ తలవంచదు.. అంటూ పదే పదే పిడికిలి బిగించి స్టేట్‌మెంట్లు ఇస్తూ.. కౌంటర్ పాలిట్రిక్స్‌ చేస్తున్నారు. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కాం.. రెండు పార్టీలకు పొలిటికల్ గేమ్‌గా మారే ఛాన్సెస్ మస్తుగా ఉన్నాయంటున్నారు అనలిస్ట్స్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News