EPAPER

Realtor Kammari Krishna Murder : కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. వివరాలు వెల్లడించిన పోలీసులు

Realtor Kammari Krishna Murder : కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. వివరాలు వెల్లడించిన పోలీసులు

Realtor Kammari Krishna Murder : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సంచలనం రేపిన కమ్మరి కృష్ణ హత్యకేసులో చిక్కుముడి వీడింది. అతడిని చంపింది మొదటి భార్య కొడుకేనని పోలీసులు నిర్థారించారు. రియల్టర్ కమ్మరి కృష్ణ.. తన ఆస్తినంతటినీ మూడో భార్యకు రాసిస్తున్నాడన్న కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఒక గ్యాంగ్ కు రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి.. తండ్రిని హత్య చేయించాడు. హత్య చేసిన నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం హైదర్ షా కోట్ కు చెందిన కమ్మరి కృష్ణ (55) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి షాద్ నగర్ పరిధిలోని కమ్మదనంలో ఒక ఫాం హౌస్ ఉంది. జూలై 10న కృష్ణ మూడవ భార్య అయిన పావనితో కలిసి ఆ ఫామ్ హౌస్ కు వెళ్లాడు. అప్పటికే అతడిని త్య చేసేందుకు ఎదురుచూస్తున్న.. కృష్ణ పర్సనల్ సహాయకుడైన బాబా, మరో ఇద్దరు చాకుతో గొంతుకోసి వెళ్లిపోయారు.

Also Read : కర్ణాటక మాజీ మంత్రి అరెస్ట్.. మనీ లాండరింగ్ కేసు ఆరోపణలపై ఈడీ విచారణ


కృష్ణ అరుపులు వినిపించగా.. పై అంతస్తులో ఉన్న భార్య పావని హుటాహుటిన కిందికి వచ్చి.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ.. అప్పటికే కృష్ణ మరణించాడు. కాగా.. బాబా గతేడాదే కృష్ణ వద్ద పనిమానేశాడు. కృష్ణ ఫాం హౌస్ కు వెళ్లిన విషయం తెలుసుకుని.. అక్కడికి వెళ్లాడు. కాసేపటికి మరో ఇద్దరు అక్కడికి రాగా.. ముగ్గురూ కలిసి కృష్ణను హత్యచేశారు. ముగ్గురు భార్యలున్న కృష్ణకు.. ఆస్తి తగాదాలున్నాయి.

మొదటి భార్యకు ఇద్దరు కొడుకులుండగా.. మూడో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు 4 రోజుల క్రితమే జరిగాయి. కృష్ణకు సుమారు రూ.100 పైగా ఆస్తులుండగా.. మొత్తం ఆస్తిని మూడో భార్య పేరిట రాస్తుండటంతో కక్ష గట్టిన మొదటి భార్య కొడుకు కమ్మరి శివ.. ప్లాన్ ప్రకారం కృష్ణను హత్య చేయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేశారు.

Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×